ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 23 మంది పోలీసులు అమరులయ్యారు. ఈ ఘటనలో నలుగురు నక్సల్స్ మరణించినట్లు మావోయిస్టులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు చెందిన ఓ వీడియో వైరల్‌గా మారింది.మావోయిస్టుల అంతిమయాత్రలో వందలమంది పాల్గొన్నట్టు వీడియోలో తెలుస్తోంది. అడవిలో వారి మృతదేహాలను మోస్తూ ‘జోహార్..జోహార్’, ‘అమర్ రహే’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అయితే ఈ వీడియో బీజాపూర్ ఘటనకు సంబంధించిందేనా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.