అవీ ఇవీ...

Updated : 23/01/2021 08:49 IST
చీకటికి భయపడకు.. లోకానికి వెలుగవ్వు (ప్రకటన)

ఆకట్టుకుంటున్న ‘జోస్‌ ఆలుక్కాస్‌’ షార్ట్‌ఫిల్మ్‌

ఆమె.. ఆకాశంలో సగం. అంతరిక్షానికి ఎగసిన కెరటం. వంటింటి నుంచి వ్యాపారం వరకు రాజకీయాల నుంచి శాస్త్రసాంకేతిక రంగాల వరకు ఆమె అడుగుపెట్టని చోటులేదు. కానీ.. ఒకప్పుడు ఆమె పరిస్థితి ఇది కాదు. దశాబ్దాలుగా సమాజం తాలూకు ఇనుప సంకెళ్లలో బందీగా చిక్కుకుపోయింది. అణచివేతకు గురైంది. వేధింపులు అనుభవించింది. తన గళం వినిపించలేకపోయింది. ఆమె అభిప్రాయాలకు విలువ లేకుండా పోయింది. కనీసం స్వేచ్ఛను అనుభవించడమూ కష్టమే అయింది.

సమాజంలోని పాత కట్టుబాట్లు, లింగ వివక్ష ఆమెను వెనక్కి నెట్టి సవాళ్లు విసిరాయనడంలో సందేహం ఏమైనా ఉందా? తన ప్రతిభా పాటవాలు, ఇష్టాఇష్టాలు గుర్తించే పరిస్థితే లేదు. అందుకే శక్తికి ప్రతిరూపమైన ఆమెకు తన శక్తి సామర్థ్యాలపైనే తరచూ సందేహాలు కలిగేవి. కానీ కెరటంలా ‘ఆమె’ ఉవ్వెత్తున ఎగసింది. క్రీడలు, వాణిజ్యం, వినోదం‌, ఫ్యాషన్‌ పరిశ్రమల్లో తనదైన ముద్రను వేసింది. మొక్కవోని ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, కసితో సమాజంలో పాత కాలం నాటి నమ్మకాలు, కట్టుబాట్లపై నిర్భయంగా పోరాడింది.

పాతకాలపు కట్టుబాట్లపై విజయం సాధించిన మహిళా శక్తిని ప్రతిబింబిస్తూ ప్రముఖ జ్యువెలరీ సంస్థ జోస్‌ ఆలుక్కాస్‌ ఓ కొత్త షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందించింది. సమాజంలో నేటికీ మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను ఇందులో చూపించారు. సమాజానికి భయపడి తన కుమార్తెకు సంప్రదాయ దుస్తులు వేసుకోవాలని ఒత్తిడి చేయడం.. నలుగురిలో మాట్లాడకుండా తన భార్యను భర్త అడ్డుకోవడం.. తన పనికోసం రాత్రివేళ బయటకు వచ్చిన మహిళలపై వేధింపులు.. ఫ్యాషన్‌ రంగంలో రాణించాలనుకున్న మహిళలను కించపరచడం.. వంటివి ఇందులో వివిధ పాత్రల ద్వారా చూపించారు. 

అలా వివక్ష ఎదుర్కొన్న వారంతా ఏ విధంగా రాణించారో ఈ షార్ట్‌ఫిల్మ్‌లో కళ్లకు కట్టారు. చివర్లో దక్షిణాదికి చెందిన ప్రముఖ నటి త్రిష చెప్పిన మాటలు ఆకట్టుకుంటున్నాయి. ‘‘నన్ను నేను నమ్మాను. నిప్పుల్లో కాలి బంగారం మెరిసినట్లు మనలో ప్రతి ఒక్కరూ అలానే మెరవగలరు’’ అంటూ ఆమె చెప్పిన మాటలు స్ఫూర్తి నింపుతున్నాయి.

అడ్డంకులు ఎన్నొచ్చినా.. ఇబ్బందులు ఎన్నెదురైనా ఆధునిక మహిళలు వెలుగులు పంచుతున్నారనేది ‘జోస్‌ ఆలుక్కాస్‌’ నినాదం. నేటి మహిళలు దుస్తులు, ఆభరణాలు తమకు నప్పుతాయా లేదా అన్నది చూడకుండా తమకిష్టమైనవన్నీ ఎంపిక చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం నిర్ణయించుకుంటున్నారు. కోరుకున్న జీవితం గడిపేందుకు నిర్భయంగా మారుతున్నారు. గర్వంగా పనులు చేస్తున్నారు. #josalukkas #goldjewellery మాదిరిగా అసలు సిసలు యోధులైన మహిళలందరికీ ‘జోస్‌ ఆలుక్కాస్‌’ వందనం చేస్తోంది. వారంతా ఇలాగే #shineon (మెరవాలని) అవ్వాలని కోరుకుంటోంది.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని