మమతా బెనర్జీ నమ్మకాన్ని నిలబెడుతున్నా!
close
Updated : 06/08/2021 05:03 IST

మమతా బెనర్జీ నమ్మకాన్ని నిలబెడుతున్నా!

ఆమె తెలుగింటి ఆడ పడుచు.. అతను బెంగాలీ ముద్దుబిడ్డ. వాళ్ల ప్రేమ బెంగాలీ రాజకీయాల్లో కీలకమవ్వడమే కాదు... ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. మమతాబెనర్జీ నమ్మకాన్ని చూరగొని మూడోసారి మంత్రిగా ఎన్నికైన ఆమె మరెవరో కాదు.. శశి పంజా! బుధవారం హైదరాబాద్‌ తెలుగు విశ్వవిద్యాలయంలోని మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంస్కృతి పురస్కార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె వసుంధరతో ప్రత్యేకంగా మాట్లాడారు.

నాన్న పీవీ కృష్ణయ్య ఐఐటీ ఖరగ్‌పుర్‌ తొలిబ్యాచ్‌ విద్యార్థి. చదువు పూర్తయిన తర్వాత అక్కడే హిందుస్థాన్‌ మోటార్స్‌లో ఉద్యోగం రావడంతో మా కుటుంబం కోల్‌కతాలో స్థిరపడింది. అన్నయ్య పీఎస్‌ మోహన్‌ కూడా బిట్స్‌లో చదివి అదే హిందుస్థాన్‌ మోటార్స్‌లో చేరాడు. మా స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. నరసరావుపేటలో పుట్టాను. నా చదువంతా హుగ్లీలో కొనసాగింది. ఆర్‌.జి.కర్‌ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చేసి అక్కడే ఇన్‌ఫెర్టిలిటీ, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ విభాగంలో వైద్యురాలిగా పని చేశాను. 

అజిత్‌ పంజా కుటుంబంలోకి...
మాజీ కేంద్రమంత్రి అజిత్‌కుమార్‌ పంజా కుమారుడు ప్రసూన్‌ కుమార్‌ మెడికల్‌ కళాశాలలో నా సహాధ్యాయి. మా ప్రేమను పెద్దలు అంగీకరించడంతో 1987లో పెళ్లి చేసుకున్నాం. అప్పటికి నాకు రాజకీయాలపై అవగాహన లేదు. పంజా కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టాక కూడా వైద్యవృత్తిని కొనసాగించాను. మావయ్యకు.. మా అత్తమ్మ జయ అండగా ఉండే వారు. ఇంట్లో ఎప్పుడూ రాజకీయ సందడి ఉండేది. 1996లో ఆమె చనిపోయారు. ఆవిడ బాధ్యతలు నేను తీసుకోవాల్సి వచ్చింది. 1998 తర్వాత అజిత్‌కుమార్‌ తృణమూల్‌లో చేరారు. నేనూ ఉత్తర కోల్‌కతా తృణమూల్‌ కాంగ్రెస్‌ మహిళా ఇన్‌ఛార్జిగా వ్యవహరించాను. మావయ్య కేంద్రమంత్రిగా ఉండటంతో స్థానిక రాజకీయాలు నేనే చూసుకునేదాన్ని. 2008లో క్యాన్సర్‌తో ఆయన చనిపోయారు. అంతటితో మా కుటుంబానికి రాజకీయాలతో సంబంధం తెగిపోయిందని భావించాను. తర్వాత నా వృత్తిపైనే దృష్టి పెట్టాను.

ఆమెని కాదనలేక...
మావారికి రాజకీయాల్లో ఆసక్తి లేదు. ఆయన కోల్‌కతాలో చర్మవ్యాధుల నిపుణుడిగా పనిచేస్తున్నారు. పుట్టి పెరిగిన వాతావరణం అదే కావడంతో ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తుంటారు. 2010లో కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రకటన వచ్చింది. మమతబెనర్జీ నన్ను పిలిచి రాజకీయాల్లో రావాలని కోరారు. ఆమె విజ్ఞప్తిని కాదనలేక రాజకీయాల్లో అడుగుపెట్టాను. ఆ ఏడాది మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా విజయం సాధించాను. మరుసటి ఏడాదే అసెంబ్లీ ఎన్నికలలో శ్యామ్‌పొకూర్‌ నియోజకవర్గం నుంచి గెలిచాను.

వరుసగా మంత్రి పదవి అందుకేనేమో..
2013లో మమత క్యాబినెట్‌లో మంత్రిగా అవకాశం దక్కింది. తొలుతగా మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి బాధ్యతలు చూశాను. 2014లో సాంఘిక సంక్షేమ శాఖను అప్పగించారు. 2016, 2021లోనూ గెలిచాక అదే శాఖకు మంత్రిగా ఉన్నా. మమతాబెనర్జీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తున్నందునే వరుసగా మంత్రి పదవి దక్కుతోందని అనుకుంటున్నా. బెంగాల్‌ ప్రభుత్వం బాలికా విద్యని ప్రోత్సహించడంతోపాటు బాల్య వివాహాలను అరికట్టేందుకు ‘కన్యశ్రీ’ పేరిట ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తోంది. దాదాపు 75 లక్షల మంది బాలికలు ఈ పథకంలో లబ్ధి పొందుతున్నారు. 18ఏళ్లు దాటిన యువతులకు విద్య కోసం రూ.25వేలు ఉపకార వేతనం అందిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఆ బాధ్యతలు మమత నాకు అప్పగించారు. ఈ పథకానికి ఐక్యరాజ్యసమితి అవార్డూ దక్కింది.

వైద్యం కొనసాగిస్తున్నా
చిన్నప్పుడు గుంటూరులో ఉండేవాళ్లం. సెలవుల్లో అమ్మమ్మ, తాతయ్య వాళ్లింటికి వెళ్లేదాన్ని. గుంటూరు నుంచి తెనాలి వరకు బస్సులో ప్రయాణం, పాత పట్టాభిపురంలో తెలుగు సినిమాలు చూడటం.. చాలా తీపి గుర్తులు ఉన్నాయి. 1989లో కేంద్రమంత్రిగా ఉన్న మా మామ అజిత్‌కుమార్‌తో కలిసి గుంటూరు వచ్చాం. నేను కేంద్ర మంత్రి కోడలినయ్యానని తెలుసుకుని స్థానికులు ఎంతో సంతోషించారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. వైద్య వృత్తిని కొనసాగిస్తుంటాను.

బెంగాల్‌ సంస్కృతి తెలియదన్నారు!
నాది తెలుగు నేపథ్యమని, ఆంధ్రప్రదేశ్‌లో పుట్టానని, బెంగాల్‌ సంస్కృతి తెలియదని నా ప్రత్యర్థులు ఎప్పుడూ విమర్శలు చేసేవారు. కానీ మమతాబెనర్జీ అలాంటి భేదాలను చూడరు. అందుకే నాకు కౌన్సిలర్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం ఇచ్చారు. నేను బెంగాలీ చాలా చక్కగా మాట్లాడతాను. బెంగాల్‌ ప్రజలు నేను తెలుగు మాట్లాడితే అర్థమైనా... కాకపోయినా ఆసక్తిగా వింటుంటారు.

పిల్లలకు పూర్తి స్వేచ్ఛ
నాకు ఇద్దరు ఆడపిల్లలు.. పూజ, నమ్రత. పూజ తృణమూల్‌ కాంగ్రెస్‌ యువజన విభాగానికి రాష్ట్ర కార్యదర్శి. న్యాయవాదిగానూ పనిచేస్తోంది. చిన్నమ్మాయి వైద్యవిద్య చదువుతోంది. 

చదవడం, రాయడం రాదు!
ఇంట్లో అమ్మతో తెలుగులో మాట్లాడతాను. బయట బెంగాలీ లేదా ఇంగ్లీష్‌లోనే మాట్లాడతాను. తెలుగు భాషపై పట్టు తక్కువే. చదవడం, రాయడం రాదు. తెలుగుపైనా పట్టు సాధించాలని ఉంది.

అమరేంద్ర యార్లగడ్డ, హైదరాబాద్‌

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని