డియర్ వసుంధర

Published : 11/01/2021 01:07 IST
పులిపిర్లతో ఇబ్బందిగా ఉంది...

నాకు 40 ఏళ్లు. చెంపల మీద చిన్న పులిపిర్లు వస్తున్నాయి. వాటికవే రాలిపోయి మళ్లీ కొత్తవి వస్తున్నాయి. వీటివల్ల బయటకు వెళ్లినప్పుడు ఇబ్బందికరంగా ఉంటోంది. ఇలా రాకుండా ఉండాలంటే ఏంచేయాలి?       

 - ఓ సోదరి

వీటినే స్కిన్‌ట్యాగ్స్‌ అనికూడా అంటారు. ఇవి ప్రమాదకరంకాదుగానీ చూడ్డానికి ఇబ్బందికరంగా ఉంటాయి. సాధారణంగా మధ్యవయసులో పులిపిర్లు వస్తుంటాయి. ఉన్నవాటిని తొలగించిన తర్వాత కొత్తవి రావని చెప్పలేం.
కారణాలు: సాధారణంగా వంశపారంపర్యంగానూ, ప్రసవానంతరం, అధిక బరువున్నా ఇవి వస్తుంటాయి. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోయినా శరీరాన్ని పొడిగా, శుభ్రంగా ఉంచుకోకపోయినా పులిపిర్లు వచ్చే అవకాశముంది. ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవు. అలాగే వీటివల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదమూ లేదు.
చికిత్స: పైపూతగా క్రీమ్‌లు వాడినా పెద్దగా ఉపయోగం ఉండదు. క్రయోథెరపీ, రేడియోఫ్రీక్వెన్సీ ద్వారా వీటిని తొలగించాలి. పులిపిర్లు వచ్చిన వెంటనే తొలగిస్తే వ్యాపించకుండా ఉంటాయి. వీటి గురించి ఎక్కువగా ఆందోళనపడాల్సిన అవసరం లేదు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని