మహిళా జయహో

Updated : 28/02/2021 02:42 IST
పింక్‌ లూ... అందుకోసం!  

ప్రయాణాల సమయంలో మగవాళ్లకు లేని అసౌకర్యం ఆడవాళ్లకే ఎదురవుతుంది. ఎందుకంటే... రహదారుల్లో అందుబాటులో ఉండే మూత్రశాలలు చాలా తక్కువ. అవి కూడా చాలా అపరిశుభ్రంగా ఉంటాయి. వాటిపై కూర్చోలేని పరిస్థితి. ఒకవేళ తప్పనిసరై వాటినే వాడుకోవాల్సి వస్తే ఇన్‌ఫెక్షన్లూ, వ్యాధుల బారిన పడటం ఖాయం. అందుకే చాలామంది ఉద్యోగినులు, విద్యార్థులు బయటకు వచ్చేటప్పుడు నీళ్లు తాగడం లేదు. ఎక్కడ టాయిలెట్‌ అవసరం వస్తుందో అని. ఫలితంగా మరిన్ని అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ సమస్యకి పరిష్కారంగా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని భూమిక రూపొందించిన ‘పింక్‌ లూ’ అనే నమూనా అందరి ప్రశంసలూ అందుకోవడంతోపాటూ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వడం విశేషం. సంగారెడ్డి జిల్లా అందోలు మండలం కన్‌సాన్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న భూమిక రాష్ట్రస్థాయి సైన్సు పోటీల కోసం ఈ నమూనాని రూపొందించింది. పాఠశాలలు, కళాశాలలకు వచ్చే అమ్మాయిలు బస్టాండులు, రైల్వే స్టేషన్లలో టాయిలెట్‌కు వెళ్లడం కోసం పడే ఇబ్బందిని చూసిన తర్వాతే ఈ నమూనాని రూపొందించానని అంటోంది భూమిక. అపరిశుభ్రంగా, అసౌకర్యంగా ఉన్న టాయిలెట్లపై కూర్చుని మూత్రవిసర్జన చేయాల్సిన అవసరం లేకుండా... నిలబడి చేసే విధంగా ఈ నమూనాని తయారుచేసింది. రైల్వేస్టేషన్లు, బస్డాండుల్లో అత్యంత తక్కువ ఖర్చుతో వీటిని ఏర్పాటు చేయొచ్చు అని అంటోంది భూమిక.  రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఆలోచనగా ఎంపికైన ఈ ఆవిష్కరణ జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికవ్వడం విశేషం.

-పతంగే రమేష్‌, జోగిపేట

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని