మహిళా జయహో

Published : 27/02/2021 01:46 IST
ఈ సెన్సర్‌..విపత్తును గుర్తిస్తుంది!

ఉత్తరాఖండ్‌లో ఇటీవల చోటుచేసుకున్న జలప్రళయం వందలాదిమంది ప్రాణాలను బలిగొంది. అకస్మాత్తుగా వచ్చే ఇటువంటి ప్రమాదాలను క్షణాల్లోనే గుర్తించి హెచ్చరించే  సెన్సర్‌ను కనిపెట్టారు వారణాసికి చెందిన ముగ్గురు విద్యార్థినులు.
అశోకా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో మూడోఏడాది చదువుతున్న విద్యార్థినులు తాజాగా గ్లేసియర్‌ ఫ్లడ్‌ అలారం సెన్సర్‌ను రూపొందించారు. హిమపాతం, వరదలు సహా పలు ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసేలా దీన్ని తయారుచేశారు. ఈ సెన్సార్‌ అలారాన్ని డ్యామ్‌ లేదా హిమపాతం సమీపంలో ఏర్పాటు చేయాలని చెబుతోంది ముగ్గురి విద్యార్థినుల్లో ఒకరైన అనూసింగ్‌. ‘ఈ పరికరంలో సెన్సర్‌ అలారం ఓ స్టాండులో అమర్చి ఉంటుంది. దీన్ని ఒకసారి రీఛార్జి చేస్తే ఆరునెలలపాటు వినియోగించే సౌలభ్యం ఉంది. వీటి తయారీకి రూ.7,000 నుంచి రూ.8,000 మాత్రమే వ్యయమైంది. అలాగే ఈ అలారానికి అనుసంధానంగా రిసీవర్‌ను విడిగా మరో స్టాండ్‌కు అమర్చాం. దీన్ని 500 మీటర్ల దూరంలోని రిలీఫ్‌ సెంటర్‌లో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు లేదా హిమపాతం కరిగి వరదలా మారే ప్రమాదకరమైన పరిస్థితులను ఈ సెన్సర్‌ తక్షణం గుర్తిస్తుంది. సమీప ప్రాంతంలో ఉండేవారిని హెచ్చరిస్తుంది. ఇదంతా క్షణాల్లోనే జరుగుతుంది. దీంతో ప్రజలు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు చేరుకుని ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది’ అని చెబుతోంది అనూ.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని