మహిళా జయహో

Published : 27/02/2021 01:46 IST
ఎనభైఏళ్ల వయసులోనూ పీహెచ్‌డీ..!

ఆసక్తి ఉండాలేగానీ.. నేర్చుకోవడానికి వయసుతో సంబంధంలేదని మరోసారి నిరూపించారు శశికళా రావల్‌. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన ఈమె ఎనభైఏళ్ల వయసులో సంస్కృతంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. లెక్చరర్‌గా పదవీ విరమణ చేశాక విక్రమ్‌ యూనివర్సిటీలో జోతిష్యంలో ఎంఏ పూర్తిచేశారు. వరాహమిహిరుడి ‘బృహత్‌ సంహిత’ను చదివిన తర్వాత దాని మీదే పీహెచ్‌డీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ గ్రంథంలో వాస్తు, దేవాలయాలు, గ్రహ సంచారం, సమయపాలన, గ్రహణాలు, జోతిష్యం.. లాంటి ఎన్నో అమూల్యమైన విషయాల గురించి సమగ్ర సమాచారాన్ని పొందుపరిచారు. అందుకని దీన్నే తన పరిశోధనా గ్రంథంగా ఎంచుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ చేతుల మీదుగా ఇటీవలే పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు. విజ్ఞాన తృష్ణకు వయసుతో సంబంధంలేదని నిరూపించేవాళ్లు ఇలా చాలా అరుదుగా ఉంటారు కదా...

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని