అర్ధరాత్రి ఎందుకలా చేస్తోంది!
close
Published : 17/05/2021 00:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అర్ధరాత్రి ఎందుకలా చేస్తోంది!

మా అక్క కూతురికి పద్దెనిమిదేళ్లు. ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తోంది. అర్ధరాత్రి లేచి చంపొద్దని అరుస్తోంది. ఎవరో తనను చచ్చిపొమ్మని చెవిలో చెబుతున్నారంటోంది. సరిగ్గా తినడంలేదు, చదవడం లేదు. బరువు బాగా తగ్గిపోయింది. భయమేస్తోంది. ఇలా ఎందుకయ్యిందో, మేమేం చేయాలో చెప్పండి?

- ఓ సోదరి, హైదరాబాద్‌

మీరు చెబుతున్న లక్షణాలు ‘స్కిజోఫ్రెనియా’లో కనిపిస్తాయి. వీటికితోడు అనుమానాలు, అసందర్భంగా మాట్లాడటం లాంటివీ ఉంటాయి. కళ్ల ముందు ఏదో ఉన్నట్లు, తమ ఆలోచనలు అందరికీ తెలుస్తున్నట్లు, ఎవరో చంపబోతున్నట్లు ఫీలవుతారు. వీటిని ‘డెల్యూషన్స్‌’ అంటారు. చెవిలో మాటలు వినిపించడాన్ని ‘హాలుసినేషన్స్‌’ అంటారు. ఇది తీవ్ర మానసిక వ్యాధి. వెంటనే సైకియాట్రిస్టుకి చూపించండి. లేదంటే చెవిలో మాటలు వినిపిస్తున్నాయని భయపడి తనకు తాను హాని చేసుకోవచ్చు లేదా ఇతరులకు చేయొచ్చు. నిద్రపట్టక, తిండి తినక ఆరోగ్యం పాడయ్యే అవకాశముంది. తక్షణం డాక్టర్‌కి చూపిస్తే అది స్కిజోఫ్రెనియానో కాదో నిర్ధరించి అవసరమైన మందులు ఇస్తారు. ఇందుకు ఏడాది పాటు మందులు వాడాల్సి రావచ్చు. రక్తసంబంధీకుల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నట్లయితే ఇంకొంత ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది.


Tags :

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని