Published : 23/11/2020 01:02 IST
ఇదంతా మాస్కు వల్లేనా...

నా వయసు 34 సంవత్సరాలు. నాది సాధారణ చర్మం. చెంపల మీద చిన్నచిన్న వైట్‌హెడ్స్‌, పింపుల్స్‌ వస్తున్నాయి. ఇలా రావడానికి కారణం ఏమిటి? మాస్కు పెట్టుకోవడంవల్లగానీ ఇలా జరుగుతోందా? ఇలాకాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

- సంధ్య, హైదరాబాద్‌

దీ

న్నే ‘అడల్ట్‌ యాక్నే’ అనికూడా అంటారు.ముప్పై ఏళ్ల నుంచి మొదలై యాభై వరకూ ఎప్పుడైనా రావచ్చు. హార్మోన్ల అసమతుల్యం, ఒత్తిడి దీనికి కారణం. కొందరికి వంశపారంపర్యంగానూ వస్తుంది. నాణ్యమైన చర్మ సౌందర్య సాధనాల్ని  వాడకపోవడంవల్ల కూడా కొందరికి ఇలా మచ్చలు వస్తాయి. అలాగే కొన్ని రకాల ఔషధాల వాడకంవల్ల కూడా ఇలాంటి ఇబ్బంది రావచ్చు.  మాస్కును ఎక్కువ సేపు వేసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. కొందరికి ముందుగా బ్లాక్‌, వైట్‌ హెడ్స్‌ వచ్చి ఆ తర్వాత అవి తగ్గి మచ్చలు పడతాయి. గడ్డలూ రావొచ్చు.
జాగ్రత్తలు: ముఖాన్ని రోజూ రెండుసార్లయినా శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. మాస్కును మధ్యలో తీసి మాయిశ్చరైజర్‌ రాసుకున్నా మంచిదే. మాస్కు వాడినప్పుడు ముఖానికి మేకప్‌ వేసుకోకూడదు. మేకప్‌ కారణంగా చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు వచ్చే ముప్పు ఎక్కువ. రాత్రి నిద్ర పోవడానికి ముందు మేకప్‌ తీసేసి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. రెండు లేయర్లున్న కాటన్‌ మాస్కును వాడటం మంచిది. ఇవి గాలి పీల్చుకోవడానికి అనువుగా ఉంటాయి. ప్రతి నాలుగు గంటలకూ  విరామం ఇచ్చిపెట్టుకోవాలి.  
చికిత్స: ముందుగా మాయిశ్చరైజర్‌ తర్వాత క్రిండామైసిన్‌ నికోటర్‌మైడ్‌ క్రీమ్‌, ఆపైన సన్‌స్క్రీన్‌ రాసుకుని మాస్కు పెట్టుకోవాలి. పడుకునేటప్పుడు సాల్సిలిక్‌ ఆధారిత క్రీమ్‌లను వాడితే మంచిది. ఇబ్బందిగా ఉంటే వైద్యుల్ని సంప్రదించండి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని