గురువారం, అక్టోబర్ 22, 2020

Updated : 28/09/2020 05:55 IST
అతడిని మరిచిపోలేకపోతోంది!

నా స్నేహితురాలు ఓ అబ్బాయిని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందానుకున్నారు. కానీ అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వేరే పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి నా ఫ్రెండ్‌ బాగా కుంగిపోతోంది. ఉద్యోగానికి వెళ్లబుద్ధికావడం లేదంటోంది. ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని భయమేస్తోంది. తనకు ఉద్యోగం చాలా అవసరం. ఇంట్లోవాళ్లు తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నేను ఎన్ని రకాలుగా చెప్పినా ఏడుస్తోందే తప్ప తనలో మార్పు కనపించడం లేదు. తనను ఎలా మార్చాలి?

- ఓ సోదరి

మీరు చెప్పిన విషయాల్ని బట్టి చూస్తే ఆమెలో కుంగుబాటు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తనపై తనకు శ్రద్ధ లేకపోవడం, మానసికంగా కుంగిపోవడం, ఇతరులతో మాట్లాడకుండా ఒంటరిగా ఉండటం.. ఇవన్నీ డిప్రెషన్‌ లక్షణాలే. తను ప్రేమించిన వ్యక్తి వేరొకరిని పెళ్లి చేసుకున్నాడు. దాంతో జీవితంలో అతడితో కలిసి ఉండటానికి అవకాశమే లేదు. అప్పటిదాకా తన వాడనుకున్న వ్యక్తి శాశ్వతంగా దూరమైపోవడంతో ఆ విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. అతడి జ్ఞాపకాలను తలుచుకుని అదేపనిగా బాధపడుతోంది. కుంగుబాటుకు గురైన వ్యక్తుల మెదడులో కొన్ని రకాల రసాయన మార్పులు జరుగుతాయి. వారు తిరిగి మాములు వ్యక్తులు కావాలంటే తప్పకుండా మందులు వాడాల్సిందే. అందులోనుంచి అంత త్వరగా బయట పడలేరు. మీ స్నేహితురాలి విషయానికి వస్తే.. ఆమె తిరిగి మామూలు వ్యక్తి కావడానికి తనకు కొంచెం టైమ్‌ పడుతుంది. ప్రస్తుత పరిస్థితిలో ఆమెను ఆ అబ్బాయిని మరిచిపోమ్మని ఒత్తిడి చేయొద్ధు ఆ అమ్మాయికి తప్పనిసరిగా సైకలాజికల్‌ థెరపీ అవసరమవుతుంది. ముందుగా తనకు నచ్చజెప్పి సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకువెళ్లండి. అతడిని ఎలా మరిచిపోవాలో ఆ సమస్యను ఎలా అధిగమించాలో, దుఃఖాన్ని ఎలా తగ్గించుకోవాలో, వాస్తవికంగా ఎలా ఆలోచించాలో.. వీటన్నింటినీ కాగ్నిటివ్‌ థెరపీ ద్వారా నేర్పిస్తారు. వ్యక్తిగత సైకలాజికల్‌ థెరపీ ద్వారా ఆమెలో మార్పు తీసుకురావొచ్ఛు డిప్రెషన్‌ తగ్గడానికి కావాల్సిన మందులతోపాటు..దాన్ని అధిగమించడానికి కొన్ని థెరపీలనూ సూచిస్తారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని