Updated : 30/10/2020 00:45 IST
అతివలు మెచ్చే ఆరణి!

సందెపొద్దు అందాలున్న ఆరణి పట్టు చీరను మీరు కట్టుకుంటే.. ‘ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే’ అని ఎవరైనా ఆనందంగా పాడాల్సిందే. ఇక చీరలపైపరుచుకున్న వర్ణాలు.. ‘సొగసు చూడతరమా’అనిపించక మానవు.

లేత గోధుమ రంగు ఆరణి పట్టు చీరపై ప్రకాశవంతమైన వర్ణాల్లో పెద్ద పెద్ద గళ్లు... టెంపుల్‌ బార్డర్‌... పసిడి కొంగు, అంచూ భలే ఉన్నాయి.

ఫ్యుషియా-ఆరెంజ్‌ పట్టు కోకపై అక్కడక్కడా పరుచుకున్న వెండి-బంగారు రంగు వృత్తాల మోటిఫ్‌లు.. రాణీపింక్‌ అంచు, కొంగూ అందంగా ఉన్నాయి కదూ.

ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభ్యమవుతాయి
ఫొటోలు: కంచర్ల జయకృష్ణ

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని