☰
గురువారం, మార్చి 04, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Published : 16/01/2021 04:20 IST
ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!

విహారయాత్రలో విషాదం
కర్ణాటకలో ఘోర ప్రమాదం
విహారయాత్రలో 10 మంది బాల్య స్నేహితురాళ్లతో సహా 13 మంది దుర్మరణం

ఈ చిత్రంలో ఉల్లాసంగా ఉన్న మహిళలు.. 20 ఏళ్ల కిందట బాల్య స్నేహితులు. సంక్రాంతి సందర్భంగా గోవా విహారయాత్రకు సిద్ధమై ఇలా ఫొటో దిగారు. కర్ణాటకలోని దావణగెరె నుంచి బయలుదేరారు. విధి వక్రించింది. 3, 4 గంటలు ప్రయాణించాక రోడ్డు ప్రమాదంలో వారి వాహనం తునాతునకలై పది మంది బాల్య స్నేహితురాళ్లతో సహా 13 మంది తుదిశ్వాస విడిచారు. చిత్రంలోని కొందరు కన్నుమూయగా, మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు.

హుబ్బళ్లి, న్యూస్‌టుడే: బాల్యం జ్ఞాపకాలను, బడిలో అల్లరిని గుర్తు చేసుకుంటూ మినీ బస్సు కేరింతలతో బయలుదేరింది. బడి నుంచి విడిపోయి అప్పుడే 20ఏళ్లు గడిచాయంటూ, ఒకరికొకరు ఆట పట్టించుకుంటూ వారంతా మళ్లీ పిల్లల్లా మారిపోయారు. అర్ధరాత్రి విహారయాత్ర ప్రారంభమైనా అందరూ కబుర్లలో మునిగిపోయారు. ఊసులూ బాసలను నెమరువేసుకుంటున్నారు. ఇంతలో పెనువిషాదం.. ఎదురుగా వచ్చిన టిప్పర్‌ వీరి బస్సును బలంగా ఢీకొంది. ఆరుగురు అక్కడికక్కడే విగతజీవులయ్యారు. అందరూ రక్తసిక్తమయ్యారు. ఆసుపత్రిలో మరో ఏడుగురు చనిపోయారు. సంక్రాంతి సందర్భంగా డ్రైవరుతో సహా బాల్య స్నేహితురాళ్లు 16మంది, 16ఏళ్ల ఒక అమ్మాయి గోవా యాత్రకు వెళ్తుండగా శుక్రవారం ఉదయం కర్ణాటకలోని ధార్వాడ నగర శివార్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది కన్నుమూశారు.మృతుల్లో టిప్పర్‌ డ్రైవరు కూడా ఉన్నారు. మరికొద్ది సమయంలో మరొక స్నేహితురాలి నివాసంలో అల్పాహారానికి దిగాల్సి ఉండగా.. ఈలోపే వారిని మృత్యువు కబళించింది. ఎదురుగా వచ్చిన టిప్పర్‌ వీరి టెంపో ట్రావెలర్‌ మినీ బస్సును ఢీకొంది. ఓ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో ఎదురుగా వచ్చిన మినీ బస్సును టిప్పర్‌ అత్యంత వేగంగా ఢీకొంది. దాదాపు 35నుంచి 38 ఏళ్ల మధ్యనున్న మృతులంతా దావణగెరె నగర పరిధి విద్యానగరకు చెందిన ఎంసీసీ బ్లాక్‌ నివాసులని గుర్తించారు. మృతులను పూర్ణిమా, ప్రవీణ, ఆశా, మానసి, పరంజ్యోతి, రాజేశ్వరి, శకుంతల, ఉషా, వేదా, నిర్మల, మంజుల, రజని, ప్రీతిగా గుర్తించారు. ఈ దుర్ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిని ధార్వాడ నగర ఆసుపత్రికి తరలించారు. మృతులు దావణగెరె నగరంలోని సెయింట్‌పాల్‌్్స పాఠశాలకు చెందిన ఒకప్పటి విద్యార్థులు. సంక్రాంతి సందర్భంగా గురువారం అర్ధరాత్రి దావణగెరె నుంచి గోవా యాత్రకు బయలుదేరారు. తెల్లవారుజామున ధార్వాడకు సమీపంలోని ఇడగట్టి వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్‌ రూపంలో మృత్యువు వారిని కబళించింది. గాయాలైన వారి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులకు అందిన సమాచారం ప్రకారం.. బాల్య స్నేహితురాళ్లు కొంతకాలంగా చిట్టీలు వేసుకున్నారు. అలా సమకూర్చుకున్న ఆదాయంతో సంక్రాంతినాడు గోవా యాత్రకు బయలుదేరారు. ఈ సమయంలోనే అంతులేని విషాదం అలుముకుంది. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ట్విటర్‌ ద్వారా ఆకాంక్షించారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • నమ్మించి మోసం చేశారు: జయలలిత
  • శశికళ సంచలన నిర్ణయం
  • డ్యాన్స్‌తో శ్రీదేవిని గుర్తు చేసిన జాన్వీ..!
  • గంటా స్పందనపై విజయసాయిరెడ్డి కౌంటర్‌
  • రాశీఖన్నా వింతకోరిక.. సారా డైలీడోస్‌
  • హీరోయిన్స్‌ కాదు కానీ.. నెట్టింట్లో స్టార్సే
  • నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది రాబోయే సినిమాలివే..
  • ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేయనున్న ప్రభాస్‌..!
  • గత్యంతరం లేకే కాల్పుల విరమణకు అంగీకారం!
  • ఇంట్లో తెలిసిపోతుందనే డిగ్రీ విద్యార్థిని ‘కట్టు’కథ
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.