Sangareddy: నేలకేసికొట్టి.. పసికందును చంపిన అమ్మమ్మ

కంటికి రెప్పలా కాపాడాల్సిన అమ్మమ్మ ఓ పసికందును హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాలను సంగారెడ్డి డీఎస్పీ రవీంద్రారెడ్డి వెల్లడించారు.

Updated : 03 Oct 2022 08:42 IST

సంగారెడ్డి, న్యూస్‌టుడే: కంటికి రెప్పలా కాపాడాల్సిన అమ్మమ్మ ఓ పసికందును హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. సంగారెడ్డి డీఎస్పీ రవీంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేట పోలీసు స్టేషన్‌ వెనుక విభాగంలో నివాసం ఉండే సత్తగారి సూర్యకళ కూలీ. ఆమెకు భర్త లేడు. కూతురు మౌనిక రెండేళ్ల క్రితం నర్సింలు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్నప్పుడు భర్త మృతి చెందాడు. దీంతో మౌనిక తల్లితోపాటే ఉంటోంది. ఆమెకు 28 రోజుల క్రితం మగ శిశువు పుట్టాడు. శనివారం రాత్రి తల్లీకూతుర్ల మధ్య వివాదం చోటు చేసుకుంది.  ఆదివారం ఉదయం కూడా గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సూర్యకళ కూతురు ఒడిలో ఉన్న పసికందును లాక్కొని నేలకేసి కొట్టింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని