స్మార్ట్‌గా

Published : 14/04/2021 00:41 IST
ఎటు తిరిగితే అటే..

అదెట్టా!

స్మార్ట్‌ ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. ఎప్పుడూ చేతిలో పట్టుకొని తిరగడమేనా? ఇప్పుడు వీటిని స్టాండ్‌ల మీదా అమర్చుకుంటున్నాం. వీడియో ఛాట్‌ చేసేప్పుడో, వీడియో చిత్రీకరించేప్పుడో ఇలాంటి స్టాండులు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిల్లో ‘మ్యాగ్నెటిక్‌ ఫోన్‌ మౌంట్‌’ చాలా ప్రత్యేకమైంది. ఇది ఫేస్‌ ట్రాకింగ్‌తో పని చేస్తుంది మరి. అంటే.. ఫోన్‌ని దీనికి అమర్చి ముందు కూర్చుంటే చాలు. ముఖాన్ని ట్రాక్‌ చేస్తూ మనం ఎటు తిరిగితే అటు తిరుగుతుంది. దీంతో వీడియోల్ని షూట్‌ చేయడం సులభమవుతుంది. దీంట్లోని మరో ప్రత్యేకత ఏంటంటే... చిత్రీకరించిన వీడియోలను మౌంట్‌కి సంబంధించిన యాప్‌తో సోషల్‌ మీడియా వేదికల్లో క్షణాల్లో అప్‌లోడ్‌ చేసే వీలుండటం.

గ్యాడ్జెట్స్‌కథనాలుసోషల్‌టెక్ వార్తలుఅవీ.. ఇవీ..యాప్స్‌ & గేమ్స్‌సైన్స్ సంగతులు

మరిన్ని