వ్యాధులు - బాధలు

Published : 02/04/2019 00:23 IST
పడుకోగానే నిద్రా?

కొందరికి ఇలా పడుకోగానే అలా నిద్ర పట్టేస్తుంది. నిద్రపట్టక సతమతమయ్యేవారికి ఇలాంటివారిని చూస్తే ఈర్ష్య పుడుతుంది కూడా. అంతకు మించిన భాగ్యం ఇంకోటి లేదనీ అనుకుంటుంటారు. కానీ ఇలా క్షణాల్లో నిద్రపట్టేయటమన్నది నిద్ర తక్కువైందనటానికి సూచనని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మనం పడుకున్న తర్వాత నిద్ర పట్టటానికి 10-15 నిమిషాలు పడుతుంది. ఒకవేళ 5 నిమిషాలలోపే నిద్ర పట్టిందంటే నిద్ర తక్కువైందనే అర్థం. కాబట్టి రోజూ ఎంత సేపు నిద్రపోతున్నారు? అది సరిపోతోందా? లేదా? అనేది ఒకసారి చూసుకోవటం మంచిది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని