వ్యాధులు - బాధలు

Published : 02/04/2019 00:23 IST
వేగంగా నడుస్తున్నారా? మెల్లగానా?

కొందరు వేగంగా నడుస్తారు. కొందరు మెల్లగా నడుస్తుంటారు. వీటిని చాలామంది శారీరక సామర్థ్యం, బలంతో ముడిపడిన వ్యవహారంగానే చూస్తుంటారు. కానీ నడక వేగం మన వ్యక్తిత్వాన్నీ ప్రతిబింబిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. వేగంగా నడిచేవారిలో కలివిడితనం, ఆత్మ విశ్వాసం, జాగరూకత, కొత్త అనుభవాలను అన్వేషించే గుణం ఎక్కువని వివరిస్తున్నారు. అదే మెల్లగా నడిచేవారిలో ముభావం, విచారం, చిరాకు, కోపం, తికమక పడటం వంటివి ఎక్కువని అంటున్నారు. అంతమాత్రాన నడక వేగాన్ని మార్చుకోవటం ద్వారా వ్యక్తిత్వం మార్చుకోవాల్సిన అవసరమేమీ లేదు. గలగలా మాట్లాడే స్వభావమైనా, అంతర్ముఖ ధోరణైనా.. రెండు వ్యక్తిత్వాలకూ బలాలు, బలహీనతలు ఉంటాయి. బలాలను ఎలా వినియోగించుకుంటున్నాం? బలహీనతలను ఎలా అధిగమిస్తున్నాం? అనేవే కీలకం.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని