వ్యాధులు - బాధలు

Published : 05/02/2019 00:23 IST
గుండెకు ఇన్‌ఫెక్షన్ల పోటు!

ధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ వంటివి గుండెపోటు ముప్పు పెరిగేలా చేస్తాయన్నది తెలిసిందే. అయితే ఇందుకు ఇన్‌ఫెక్షన్లు కూడా దోహదం చేస్తాయంటే నమ్మతారా? న్యుమోనియా, మూత్రకోశ ఇన్‌ఫెక్షన్ల వంటి సమస్యల బారినపడ్డ మూడు నెలల తర్వాత గుండెపోటు ముప్పు 37%, పక్షవాతం ముప్పు 30% పెరుగుతున్నట్టు మిన్నెసోటా మెడికల్‌ స్కూల్‌ అధ్యయనం పేర్కొంటోంది మరి. సాధారణంగా ఇన్‌ఫెక్షన్లు దాడిచేసినపుడు వాటిని ఎదుర్కోవటానికి రోగనిరోధకవ్యవస్థ పెద్దఎత్తున తెల్లరక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా ఒంట్లో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) మొదలవుతుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే- ఈ ప్రక్రియలో ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా పెరగటం. ఇవి రక్తం గడ్డలు ఏర్పడటానికి దోహదం చేస్తున్నాయని, ఈ గడ్డలు గుండె లేదా మెదడు రక్తనాళాల్లో చిక్కుకొని అడ్డుపడితే గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరిగే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. ఇన్‌ఫెక్షన్ల తీవ్రత పెరిగినకొద్దీ ముప్పులూ ఎక్కువవుతున్నాయనీ వివరిస్తున్నారు. అందువల్ల ఇన్‌ఫెక్షన్లను తేలికగా తీసుకోవటానికి వీల్లేదని.. ముఖ్యంగా గుండెజబ్బు ముప్పులు గలవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని