వ్యాధులు - బాధలు

Published : 29/01/2019 01:17 IST
ఆకుపచ్చ హుషారు!

రోజూ ఉత్సాహంగా, హుషారుగా ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఇంటి పరిసరాల్లో చెట్లు, మొక్కలు, గడ్డి వంటివి పెంచుకొని చూడండి. ఇలాంటి పచ్చదనం కనులకు విందు చేయటమే కాదు.. మనసునూ ఆహ్లాదంతో నింపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవల ఫిలడెల్ఫియా పరిశోధకులు కొన్ని ఖాళీ ప్రాంతాల్లో చెట్లు, మొక్కలు, గడ్డి పెంచి ఫలితాలను బేరీజు వేశారు. ఆ ఖాళీ ప్రాంతాల చుట్టుపక్కల నివసించేవారిలో మొక్కలు నాటటానికి ముందూ తర్వాతా కుంగుబాటు తీరుతెన్నులను పరిశీలించారు. మొక్కలు పెంచిన తర్వాత కుంగుబాటు లక్షణాలు 41.5% తగ్గటం గమనార్హం. మానసిక ఆరోగ్యం బాగా లేదని చెప్పేవారి సంఖ్య కూడా 62.8% వరకు తగ్గుముఖం పట్టటం విశేషం.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని