వ్యాధులు - బాధలు

Published : 20/07/2021 02:12 IST
ప్రథమం ప్రధానం

ప్రథమ చికిత్స చాలా కీలకం. ఇది సమస్య తీవ్రం కాకుండా కాపాడుతుంది. త్వరగా నయం కావటానికి తోడ్పడుతుంది. అందువల్ల అప్పుడప్పుడు ఎదుర్కొనే కొన్ని సమస్యల్లో అనుసరించాల్సిన ప్రథమ చికిత్సల గురించి తెలుసుకొని ఉండటం మంచిది.

* పన్ను ఊడిపోతే దంతమూలాన్ని చేత్తో పట్టుకోకూడదు. దుమ్ము అంటుకుంటే వెంటనే నీటితో కడిగి, తిరిగి చిగురు రంధ్రంలో పెట్టి, 5 నిమిషాల సేపు అలాగే పట్టుకోవాలి. చిగురులో పెట్టటం కుదరకపోతే బుగ్గన పెట్టుకోవాలి. పాలలోనైనా వేసి ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లా నీటిలో దంతాన్ని వేయరాదు. నల్లా నీరు దంత మూలాన్ని దెబ్బతీస్తుంది. అరగంటలోపు ఊడిన దంతంతో డాక్టర్‌ను సంప్రదిస్తే తిరిగి బిగించటానికి వీలవుతుంది.

* ముక్కు నుంచి రక్తం కారితే తలను ముందుకు వంచి ఉంచాలి. వెనక్కి వంచితే రక్తం గొంతులోకి వెళ్లిపోవచ్చు. ఇది జీర్ణాశయాన్ని చికాకుకు గురిచేయొచ్చు. కొన్నిసార్లు గొంతులో రక్తం అడ్డుపడొచ్చు. ముక్కు నుంచి రక్తం కారుతున్నప్పుడు కింద పడుకోవటమూ మంచిది కాదు. ఎప్పుడైనా తలను గుండెకు ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. దీంతో రక్తస్రావం త్వరగా నెమ్మదిస్తుంది. బొటన వేలు, ఉంగరం వేలితో ముక్కును 5 నిమిషాల సేపు గట్టిగా బిగించి పట్టుకోవాలి. అప్పటికీ రక్తస్రావమవుతుంటే మరికొంత సేపు అలాగే పట్టుకోవాలి. ఒకవేళ 20 నిమిషాలైనా రక్తం ఆగకపోతే ఆసుపత్రికి వెళ్లాలి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని