వ్యాధులు - బాధలు

Published : 08/06/2021 01:10 IST
మూడేళ్లకోసారి వినికిడి పరీక్ష

వయసు మీద పడుతున్నకొద్దీ తలెత్తే వినికిడి లోపం సాధారణంగా రెండు చెవుల్లోనూ మొదలవుతుంది. రెండు చెవుల్లోనూ సమానంగా తగ్గుతుంది. వయసుతో పాటు ముంచుకొచ్చే అధిక రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులు.. చెవుల్లోని నాడీ కణాలను దెబ్బతీసే కొన్నిరకాల మందుల వంటివి దీని ముప్పు పెరిగేలా చేయొచ్చు. ఇలాంటి వినికిడి లోపం నెమ్మదిగా ఎక్కువ అవుతూ వస్తుంటుంది. చాలామంది వినికిడి తగ్గేంతవరకూ దీన్ని గుర్తించనే లేరు. కాబట్టి 45 ఏళ్లు దాటాక ప్రతి ఒక్కరూ మూడేళ్లకు ఒకసారి వినికిడి పరీక్ష చేయించుకోవటం మంచిది. అదే స్పష్టంగా శబ్దాలు వినిపించకపోతున్నా, చెవులు దిబ్బడ వేసినట్టు అనిపిస్తున్నా, రింగుమనే మోత వినిపిస్తున్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని