వ్యాధులు - బాధలు

Published : 27/04/2021 01:19 IST
రక్తంలో వయసు గుట్టు!

న శరీర భవనానికి ప్రొటీన్లే ఇటుకలు. ఇవి వయసు, ఆరోగ్యం తీరుతెన్నులను అంచనా వేయటానికీ ఉపయోగపడగలవని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పైగా ఇవి వయసుతో పాటు మారిపోతుండటం గమనార్హం. పరిశోధకులు 18-95 ఏళ్ల వయసుకు చెందిన కొందరి ప్లాస్మా నమూనాలను సేకరించి.. సుమారు 3 వేల ప్రొటీన్ల స్థాయులను పోల్చి చూశారు. వీటిల్లో 375 ప్రొటీన్లు వయసును అంచనా వేయటానికి తోడ్పడగలవని తేలింది. అసలు వయసు కన్నా తక్కువ వయసు ఉన్నట్టు వీటి ద్వారా గుర్తించినవారు శారీరక, మానసిక పరీక్షలో బాగా రాణించటం విశేషం. రక్తంలో ప్రొటీన్లు మూడు దశల్లో.. 34, 60, 78 ఏళ్లలో మారిపోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కొన్ని ప్రొటీన్లు వయసుతో తలెత్తే జబ్బులతో ముడిపడి ఉంటున్నాయి కూడా. ఉదాహరణకు- గుండెజబ్బు, అల్జీమర్స్‌కు సంబంధించిన ప్రొటీన్లు 60, 70 ఏళ్ల వయసువారిలో కనిపించటం. ఏదో ఒకనాడు రక్త పరీక్ష ఆధారంగా వయసుతో ముడిపడిన జబ్బుల ముప్పు ఎక్కువగా గలవారిని గుర్తించే అవకాశముందని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని