వ్యాధులు - బాధలు

Published : 23/02/2021 01:02 IST
పొడి చర్మానికి పరిమళ రక్ష

ర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేయటంలో పరిమళ నూనెలు బాగా ఉపయోగపడతాయి. అయితే చర్మం తీరును బట్టే వీటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు- పొడి చర్మాన్నే తీసుకోండి. పొడి చర్మం ఉన్నంత మాత్రాన నూనె దట్టంగా పట్టించాల్సిన అవసరం లేదు. అలాగే ఎలాంటి నూనెలనైనా వాడుకోవచ్చని అనుకోవటానికీ లేదు. పొడి చర్మానికి బాదం నూనె, రోజ్‌హిప్‌ నూనెలు మేలు చేస్తాయి. బాదం నూనె చర్మంలో తేమనే కాదు, మృదుత్వాన్నీ పెంపొందిస్తుంది. ఇందులోని విటమిన్‌ ఎ, రెటినాల్‌ చర్మం కింది రక్తనాళాలను ప్రేరేపిస్తాయి. చర్మం బిగుతుగా ఉండటానికి తోడ్పడే కండర పోచల (కొలాజెన్‌) ఉత్పత్తికీ దోహదం చేస్తాయి. ఎండుగజ్జి వంటి సమస్యలు తగ్గటానికీ బాదం నూనె ఉపయోగపడుతుంది. ఇక రోజ్‌హిప్‌ నూనెలో అత్యవసర కొవ్వు ఆమ్లాలన్నీ ఉంటాయి. అందువల్ల పొడి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని చర్మం తేలికగానూ గ్రహించుకుంటుంది. ఇది తేమను పట్టి ఉంచుతుంది. అలాగే చర్మం ఎర్రబడటాన్నీ తగ్గిస్తుంది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని