వ్యాధులు - బాధలు

Published : 09/02/2021 01:14 IST
ప్రసవానంతర కుంగుబాటు మూడేళ్ల వరకూ!  

కాన్పు తర్వాత చాలామంది మహిళలు కుంగుబాటుకు (పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌) లోనవుతుంటారు. ఆందోళన, విచారం, నిద్ర పట్టకపోవటం, తమను తాము నిందించుకోవటం వంటి వాటితో సతమతమవుతుంటారు. ఐదారు నెలల్లో చాలావరకివి తగ్గిపోతాయి గానీ కొందరిలో మూడేళ్ల వరకూ కొనసాగుతున్నట్టు తాజాగా బయటపడింది. గతంలో మూడ్‌ సమస్యల బారినపడ్డవారిలో ఇలాంటి ధోరణి ఎక్కువగా ఉంటోంది. లక్షణాలూ తీవ్రంగానే ఉంటున్నాయి. గర్భిణి మధుమేహం తలెత్తినవారికి దీని ముప్పు పెరుగుతోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్రసవానంతర కుంగుబాటు లక్షణాలను బేరీజు వేయటానికి ఆరు నెలల సమయం సరిపోదని, తల్లుల మానసిక ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవటానికి దీర్ఘకాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని