వ్యాధులు - బాధలు

Published : 05/05/2020 00:53 IST
కరోనాతో ఢీ!

కొవిడ్‌-19 మరణాలకు విటమిన్‌ డి లోపానికి సంబంధముందా? కరోనా జబ్బు ముప్పు పెరగటానికి విటమిన్‌ డి లోపం దోహదం చేస్తోందా? అవుననే అంటున్నారు బ్రిటన్‌లోని ఈస్ట్‌ యాంగ్లియా విశ్వవిద్యాలయ పరిశోధకులు. కొవిడ్‌-19 బారినపడుతున్నవారిలో, దీంతో మరణిస్తున్నవారిలో చాలామంది విటమిన్‌ డి లోపం గలవారే కావటం గమనార్హం. అంతమాత్రాన కరోనా జబ్బుకు ఇది కారణమవుతున్నట్టు ఇప్పుడప్పుడే చెప్పలేమని పరిశోధకులు అంటున్నారు. కానీ కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ నుంచి కాపాడుకోవటానికి విటమిన్‌ డి మాత్రలను సిఫారసు చేయొచ్చనే భావిస్తున్నారు. ఏదేమైనా కరోనా కలకలం మొదలైనప్పట్నుంచి విటమిన్‌ సి, విటమిన్‌ డి వాడకం బాగా పెరిగింది. నిర్బంధం, స్వీయ నిర్బంధం మూలంగా ఎంతోమంది నీడ పట్టునే ఉండటం వల్ల సహజంగా లభించే విటమిన్‌ డిని పొందలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రోజుకు 10 మైక్రోగ్రాముల విటమిన్‌ డి తీసుకోవాలని నిపుణులు సిఫారసు చేస్తున్నారు. విటమిన్‌ సి, విటమిన్‌ డి రోగనిరోధకశక్తిని పెంచుతాయన్న సంగతి తెలిసిందే. వీటితో ఫ్లూ, క్షయ వంటి ఇతరత్రా శ్వాసకోశ సమస్యల ముప్పు తగ్గుతుంది. ఇవి కొవిడ్‌-19 నివారణకూ తోడ్పడగలవని తాజా అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని