వ్యాధులు - బాధలు

Published : 07/01/2020 00:32 IST
రాసుకుంటే బాధ తగ్గుతుంది!

మనసులోని బాధ చెప్పుకొంటే పోతుందంటారు. నోట్‌బుక్‌లో రాసుకున్నా తగ్గుతుంది! ఒత్తిడికి గురిచేస్తున్న పరిస్థితులను, సంఘటనలను.. ఆందోళన, బాధలను రాసుకుంటే మెదడుకు విరామం లభిస్తుంది. ఇది ఏకాగ్రత పెరగటానికి.. పనులను మరింత మెరుగ్గా, త్వరగా పూర్తిచేయటానికి దోహదం చేస్తుందని మిషిగన్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. అదేపనిగా బాధ పడుతుంటే మెదడు విపరీతంగా శ్రమించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కష్టమైన పనులను ముందేసుకుంటే మెదడు మీద ఇంకాస్త భారం పడుతుంది. దీంతో ఏకాగ్రత కుదరక నైపుణ్యమూ తగ్గుతుంది. మనసులోని భావాలను రాసుకోవటం వల్ల మెదడు మీద భారం తగ్గి హుషారుగా పనిచేస్తుంది. బాధలు తగ్గితే మున్ముందు ఎదురయ్యే ఒత్తిళ్లనూ తట్టుకునేలా మెదడు సిద్ధమవుతుంది. కాబట్టి అదేపనిగా విచారిస్తుంటే మనసులోని భావాలకు అక్షర రూపం ఇవ్వండి. మెదడు, మనసు తేలికపడతాయి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని