వ్యాధులు - బాధలు

Published : 19/11/2019 00:31 IST
మీ తలలో నొప్పుందా?

తలనొప్పి తరచూ చూసేదే. ఎప్పుడో అప్పుడు అంతా దీంతో సతమతమైనవారే.  రోజువారీ ఎదురయ్యే ఒత్తిడితో పాటు  పరోక్షంగానూ కొన్ని అంశాలు తలనొప్పికి దారితీయొచ్చు.

నీటిశాతం తగ్గటం: అకారణంగా తలనొప్పి వేధిస్తుంటే రోజూ ఎన్ని నీళ్లు తాగుతున్నారో ఒకసారి చూసుకోండి. నీటిశాతం తగ్గినా (డీహైడ్రేషన్‌) తలనొప్పి రావొచ్చు మరి. ఒంట్లో నీరు తగ్గినప్పుడు మెదడు తాత్కాలికంగా కుంచించుకుపోతుంది. దీంతో మెదడు పుర్రె నుంచి కాస్త వెనక్కి జారి, నొప్పికి దారితీస్తుంది. తగినన్ని నీళ్లు తాగగానే యథాస్థితికి వస్తుంది. నొప్పీ తగ్గుతుంది.

సరిగా తినకపోవటం: భోజనానికీ భోజనానికీ మధ్యలో చాలా ఎక్కువసేపు ఎడం ఉన్నా తలనొప్పి రావొచ్చు. తరచూ తలనొప్పితో బాధపడేవారు దీన్ని గుర్తుంచుకోవాలి. కొందరికి పిండి పదార్థాలు, మిఠాయిల వంటివి తిన్నప్పుడూ నొప్పి వస్తుండొచ్చు. ఇలాంటివి గమనిస్తే ఆయా పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

భంగిమ దెబ్బతినటం: సరిగా కూర్చోకపోవటం, నిలబడకపోవటం వల్ల తల, మెడ, దవడలు, భుజాల వెనక కండరాలు ఒత్తిడికి లోనవుతాయి. ఎక్కువసేపు ఇలాగే ఉండిపోతే అక్కడి నాడుల మీదా ఒత్తిడి పెరుగుతుంది. ఇది తలనొప్పికి దారితీస్తుంది.

మద్యం అలవాటు: మద్యంతో మూత్రం ఎక్కువగా వస్తుంది. మూత్రంతో పాటు ఉప్పు, విటమిన్లు, ఖనిజాలూ పోతాయి. అందువల్ల మద్యం ఎక్కువగా తాగితే  నీరు, ఖనిజ లవణాల సమతుల్యత అస్తవ్యస్తమై తలనొప్పి రావొచ్చు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని