వ్యాధులు - బాధలు

Published : 29/10/2019 00:20 IST
గుండె మీద రక్తహీనత భారం!

క్తహీనతతో బాధపడేవారిలో తగినన్ని ఎర్ర రక్తకణాలు ఉండవు. ఉన్న కణాలూ సక్రమంగా లేకపోవచ్ఛు దీంతో శరీరంలోని భాగాలకు తగినంత రక్తం సరఫరా కాదు. దీంతో బలహీనత, మగత, చర్మం పాలిపోవటం, తలనొప్పి, పాదాలు, చేతులు చల్లపడటం, శరీర ఉష్ణోగ్రత తగ్గటం, ఆయాసం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాదు, గుండె సంబంధ సమస్యలూ బయలుదేరొచ్ఛు రక్తంలో తగినంత ఆక్సిజన్‌ లేనప్పుడు గుండె మరింత బలంగా, ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. అప్పటికి గానీ అవయవాలకు రక్తం, ఆక్సిజన్‌ అందవు. ఇలా గుండె ఎక్కువగా కష్టపడి పనిచేయటం వల్ల గుండె లయ దెబ్బతినొచ్ఛు ఒకసారి ఎక్కువగా, ఒకసారి తక్కువగా కొట్టుకోవచ్ఛు శ్వాస తీసుకోవటం కష్టం కావచ్ఛు ఛాతీలో నొప్పీ తలెత్తొచ్ఛు ఇలాంటి లక్షణాలేవైనా కనిపిస్తుంటే రక్తహీనత ఉందేమో ఒకసారి పరీక్షించుకోవటం మంచిది. ఒకవేళ రక్తహీనత ఉన్నట్టు తేలితే ఐరన్‌ మాత్రలు వేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కొందరికి ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి12 కూడా అవసరమవ్వచ్ఛు

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని