వ్యాధులు - బాధలు

Published : 29/10/2019 00:17 IST
మధుమేహానికి ‘పొడవు’ రక్ష!

పొ

డవుగా ఉన్నారా?పొట్టిగా ఉన్నారా? ఇప్పుడెందుకు ఇవన్నీ అనుకుంటున్నారా? పొడవుగా ఉండేవారితో పోలిస్తే పొట్టిగా ఉండేవారికి మధుమేహం (డయాబెటీస్‌) ముప్పు ఎక్కువని జర్మనీ అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. ఎత్తు తగ్గినకొద్దీ ముప్పూ పెరుగుతుండటం గమనార్హం. ఎత్తు తగ్గుదలలో ప్రతి 4 అంగుళాలకు మధుమేహం ముప్పు మగవారికైతే 41%, ఆడవారికైతే 33% మేరకు పెరుగుతూ వస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దీనికి కారణమేంటో తెలుసా? ఎత్తు తక్కువగా ఉండేవారి కాలేయంలో కొవ్వు స్థాయులు ఎక్కువగా ఉండటం. గుండెజబ్బులు, ఇతరత్రా జీవక్రియ సంబంధ జబ్బులకు దారితీసే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, వాపు ప్రక్రియలు సైతం ఎక్కువగానే ఉంటుండటం గమనార్హం. ఇవన్నీ మధుమేహాన్ని తెచ్చిపెట్టేవే. అందుకే కాలేయ కొవ్వును తగ్గించే పద్ధతులతో మధుమేహం ముప్పును తగ్గించుకునే అవకాశం లేకపోలేదని పరిశోధకులు సూచిస్తున్నారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని