వ్యాధులు - బాధలు

Published : 08/10/2019 00:59 IST
తన శాంతమె తనకు రక్ష!

యసు మీద పడుతున్నకొద్దీ ప్రవర్తన తీరూ మారుతుంటుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో మార్పులు మరింత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బాధ, విచారం, కోపం. కొందరికి తేలికగా కోపం ముంచుకొస్తుంటుంది. ఇది బాధ, విచారం కన్నా ఎక్కువ హాని చేసే అవకాశముందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. రోజూ కోపం తెచ్చుకునే 80 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) చాలా ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. బాధ, విచారంతో ఇలాంటి ప్రభావం అంతగా కనిపించకపోవటం గమనార్హం. వాపు ప్రక్రియ మూలంగా గుండెజబ్బు, కీళ్లవాపు, క్యాన్సర్‌ వంటి సమస్యల ముప్పు పెరుగుతుందన్నది తెలిసిందే. తరచూ ఆగ్రహానికి గురయ్యే వృద్ధులకు దాన్ని తగ్గించుకునే పద్ధతులను నేర్పిస్తే ఇలాంటి దీర్ఘకాల సమస్యల బారినపడకుండా కాపాడుకోవచ్చని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని