వ్యాధులు - బాధలు

Published : 01/10/2019 01:19 IST
అపెండిక్స్‌ వాపునకుయాంటీబయోటిక్స్‌!

పెండిక్స్‌ వాపు అనగానే తీవ్రమైన కడుపునొప్పి, అత్యవసరంగా ఆపరేషన్‌ చేయటమే గుర్తుకొస్తుంది. యాంటీబయోటిక్స్‌ చికిత్స ద్వారా ఈ శస్త్రచికిత్సను చాలాకాలం వాయిదా వేసుకునే అవకాశముందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కొందరిలో అసలు ఆపరేషన్‌ అవసరమే ఉండకపోవచ్చనీ తేలింది. అంత సమస్యాత్మకం కాని అపెండిక్స్‌ వాపుతో బాధపడే 257 మందికి ఫిన్‌లాండ్‌ పరిశోధకులు వారం పాటు యాంటీబయోటిక్‌ చికిత్స ఇచ్చి పరిశీలించారు. ఐదేళ్ల కాలంలో వీరిలో 60% మందికి అసలు ఆపరేషన్‌ చేయాల్సిన అవసరమే రాలేదు. కొందరికి అపెండిక్స్‌ను తొలగించాల్సి వచ్చినా అప్పటి వరకూ ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించలేదు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని