వ్యాధులు - బాధలు

Updated : 27/08/2019 01:05 IST
‘పచ్చ’గా వర్ధిల్లండి!

పిల్లలు పెద్దయ్యాక సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అనుకుంటున్నారా? అయితే ఇంటి చుట్టుపక్కల చెట్లు చేమలతో కూడిన పచ్చటి వాతావరణం ఉండేలా చూసుకోండి. బాల్యంలో పచ్చటి పరిసరాల్లో పెరిగినవారు పెద్దయ్యాక మరింత సంతోషకరమైన జీవనాన్ని గడుపుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. పరిశోధకులు సుమారు 10 లక్షల డెన్మార్క్‌ వాసులను ఎంచుకొని, చిన్నప్పుడు వారు గడిపిన ఇళ్లను ఉపగ్రహ చిత్రాల సమాచారంతో విశ్లేషించి మరీ ఈ విషయాన్ని గుర్తించారు. పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఎక్కువకాలం పచ్చటి పరిసరాల్లో గడిపినవారికి మానసిక జబ్బుల ముప్పు 45% వరకూ తక్కువగా ఉంటున్నట్టు తేలటం విశేషం. మానసిక జబ్బులకు కారణమయ్యే ఇతరత్రా ముప్పు కారకాలను పక్కనబెట్టి చూసినా ఈ ప్రయోజనం కనపడుతుండటం గమనార్హం.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని