వ్యాధులు - బాధలు

Published : 04/06/2019 00:25 IST
బరువు తక్కువుంటేనేం..?

ఎంతసేపూ కదలకుండా కూచుంటే బరువు తక్కువున్నా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ఇలాంటి జీవనశైలి గలవారికి  అధికబరువు గలవారితో సమానంగా గుండెజబ్బు ముప్పు ముంచుకొస్తోంది మరి. ముందుకు పొడుచుకువచ్చే పొట్ట, కాస్త వేగంగా లేదా ఎత్తుకు నడుస్తున్నప్పుడు త్వరగా ఆయాసం రావటం వంటివన్నీ కదలకుండా ఎక్కువసేపు కూచుంటున్నామనటానికి సూచనలే. బరువు మామూలుగానే ఉన్నప్పటికీ ఇలాంటి లక్షణాలుంటే మాత్రం జాగ్రత్త పడక తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అధికబరువు గలవారి మాదిరిగానే వీరికి కూడా గుండెజబ్బు ముప్పు సుమారు 30% పెరుగుతోందని వివరిస్తున్నారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని