సుఖీభవ

Published : 23/04/2019 00:27 IST
నలబై దాటారా?

కొందరు.. ముఖ్యంగా 40ల్లోకి అడుగుపెట్టిన తర్వాత వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గటం లేదని చెబుతుంటారు. దీనికి ప్రధాన కారణం కండర మోతాదు తగ్గుతుండటం. 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి పదేళ్లకు 3-5% కండరాల మోతాదు తగ్గుతుంటుంది. దీంతో జీవక్రియలు మందగిస్తాయి. కండర మోతాదు ఎక్కువుంటే విశ్రాంతి తీసుకుంటున్నప్పుడూ జీవక్రియలు చురుకుగా సాగుతాయి. అంటే వ్యాయామం చేస్తున్నప్పుడే కాదు.. విశ్రాంతితీసుకుంటున్నప్పుడూ కేలరీలు ఖర్చవుతూనే ఉంటాయన్నమాట. అందువల్ల నడక వంటి వాటితో పాటు కండరాలను పెంచే వ్యాయామాల మీదా దృష్టి పెట్టటం మంచిది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని