సుఖీభవ

Published : 17/12/2019 01:17 IST
చేపలు ‘మంచి’వైతేనే..

చేపలు-మధుమేహం ముప్పు మీద భిన్నాభిప్రాయాలు వినిపిస్తుండటం కొత్తేమీ కాదు. కొన్ని అధ్యయనాలు చేపలతో మధుమేహం ముప్పు తగ్గుతుందని చెబుతుంటే.. అసలు అలాంటి ప్రయోజనమేమీ ఉండదని, పైగా ముప్పు పెరుగుతుందనీ మరికొన్ని వివరిస్తున్నాయి. ఇలాంటి భిన్న ఫలితాలు ఎందుకు వస్తున్నాయి? తాజా స్వీడన్‌ అధ్యయనం ఒకటి దీని మీదే దృష్టి సారించింది. చేపలు తినే 842 మందిని ఏడేళ్ల పాటు పరిశీలించగా.. వీరిలో సగం మంది మధుమేహం బారినపడ్డట్టు తేలింది. అంటే సగం మందికే ముప్పు తగ్గిందన్నమాట. ఫలితాలను లోతుగా విశ్లేషించగా కాలుష్య కారకాలు ఇందులో పాలు పంచుకుంటున్నట్టు బయటపడింది. కొవ్వు ఎక్కువగా ఉండే సాల్మన్‌ వంటి చేపలు తిన్నవారి రక్తంలో పర్యావరణాన్ని కలుషితం చేసే కారకాలూ పెద్దమొత్తంలో ఉంటున్నట్టు తేలింది. ముఖ్యంగా డీడీటీ, పీసీబీ కాలుష్య కారకాలు చేపల్లో ఎక్కువగా ఉండటమే దీనికి కారణమన్నది శాస్త్రవేత్తల భావన. డీడీటీ, పీసీబీ రెండూ మధుమేహం ముప్పు పెరగటానికి దోహదం చేస్తున్నట్టు గతంలోనే వెల్లడి కావటం గుర్తించాల్సిన విషయం.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని