సుఖీభవ

Published : 17/12/2019 01:17 IST
మా వృద్ధ వ్యాయామం!

వృద్ధులు తూలి కింద పడిపోవటం తరచూ చూసేదే. 65 ఏళ్లు పైబడినవారిలో కనీసం మూడింట ఒకవంతు మంది ఎప్పుడో అప్పుడు కింద పడిపోతుంటారు. దీన్ని నివారించుకోవటానికి శారీరక శ్రమ, వ్యాయామం ఎంతగానో తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. శరీరాన్ని లయబద్ధంగా కదిలిస్తూ చేసే థాయ్‌ చీ సాధన చేసేవారికి కింద పడిపోయే ముప్పు 19% తక్కువగా ఉంటుండగా.. మెట్టు ఎక్కి దిగటం, కుర్చీ ఎత్తటం, ఒక కాలు మీద నిలబడటం వంటి బ్యాలెన్స్‌ వ్యాయామాలు చేసేవారికి 24% ముప్పు తగ్గుతున్నట్టు బయటపడింది. రకరకాల వ్యాయామాలను కలిపి చేస్తే మరింత ఎక్కువ ప్రయోజనం కనిపిస్తుండటం విశేషం. బరువులు ఎత్తటం, శరీరం తూలకుండా నిలిపే వ్యాయామాలు చేసేవారికి కింద పడిపోయే ముప్పు ఏకంగా 34% తగ్గటం గమనార్హం. కాబట్టి ఓపిక తెచ్చుకొని అయినా శరీరానికి కాస్త పని చెప్పటం మంచిది. కింద పడిపోతే తుంటి ఎముక విరిగి, మంచాన  పడే ప్రమాదముందని గుర్తుంచుకోవాలి. వృద్ధాప్యంలో ఎముక అతుక్కోవటం అంత తేలికైన పనికాదు. పరిస్థితి అంతవరకూ రాకుండా ముందు నుంచే జాగ్రత్త పడటం మేలు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని