మంగళవారం, అక్టోబర్ 27, 2020

Updated : 01/08/2020 03:06 IST
ఆ మూడింటిపైనే భవితవ్యం

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటి అవసరం ఉందా? కొనడానికి ఇది సరైన సమయమేనా? బడ్జెట్‌లోనే అందుబాటులో ఉన్నాయా? ఈ మూడు అంశాల చుట్టూనే ప్రస్తుతం గృహ కొనుగోలుదారుల ఆలోచనలు తిరుగుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ను ఇతర రంగాల మాదిరిగానే కొవిడ్‌-19 పెద్ద షాక్‌కు గురిచేసింది. ఈ రంగం ముఖ్యంగా నివాస మార్కెట్‌ భవితవ్యం మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలతో ముడిపడి ఉంది. కొనుగోలుదారుల ప్రయోజనాలు కాపాడేందుకు ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన విధాన మార్పులు, నియంత్రణ సంస్కరణలతో భరోసా పెరుగుతున్న దశలో కొవిడ్‌ మహమ్మారి పిడుగులా వచ్చి పడింది. రాబోయే కొద్దినెలలల్లో నగరాలు సాధారణ స్థితికి చేరుకుని వ్యాపార కార్యకలాపాలను యాథవిధిగా కొనసాగించే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ కోలుకునే దిశగా పయనిస్తోందని జేఎల్‌ఎల్‌ తాజా అధ్యయనంలో వెల్లడించింది. ఇల్లు కొనే ఆలోచన ఉన్నవారిలో 50 శాతంకంటే ఎక్కువ మంది రాబోయే ఆరు నెలల్లో తమ కలల గృహం కొనుగోలు చేసే అవకాశం ఉందని వీరి సర్వేలో వెల్లడైంది. ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధిపై వీరి నిర్ణయాలు ఆధారపడి ఉన్నప్పటికీ ఇల్లు కొనడానికి ఇదే సరైన సమయం అంటున్నారు నిర్మాణదారులు. అందుబాటులో ఇళ్ల ధరలు, తక్కువ గృహరుణ వడ్డీరేట్లు, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన రుణ ఆధారిత వడ్డీరేట్ల సబ్సిడీ పథకం కొనుగోలుదారులకు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు.

35 ఏళ్లపైనున్నవారే ఎక్కువగా..
అన్ని అనుకూలిస్తే ఆరునెలల్లో ఇల్లు కొంటామన్నవారిలో ఎక్కువ శాతం మంది స్వయం ఉపాధి పొందుతున్నవారు ఉన్నారు. 50 శాతం మంది వీరే ఉన్నారు. ఉద్యోగులు 35 శాతం మంది మాత్రమే ఉన్నారు. ఉద్యోగ భద్రతపై అనిశ్చితి ఇందుకు కారణంగా కనబడుతోంది. వీరు చూద్దాంలే అనే దోరణిలో ఉన్నారు. వయసుల వారీగా చూస్తే ఇదే స్పష్టమవుతోంది. ఆరునెలల్లోపు కొంటామన్నవారిలో 35 ఏళ్లలోపు వారు 36 శాతం మాత్రమే ఉండగా.. ఆపై వయసున్నవారు 54 శాతంగా ఉన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని