బెర్న్: స్విస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత జోడీ సాత్విక్ సాయిరెడ్డి-అశ్విని పొన్నప్ప శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్-అశ్విని 21-18, 21-10తో హఫీజ్-గ్లోరియా (ఇండోనేసియా)ను ఓడించారు. తొలి గేమ్‌లో తప్ప ప్రత్యర్థుల నుంచి వారికి ప్రతిఘటన ఎదురు కాలేదు. మరో మ్యాచ్‌లో సిక్కిరెడ్డి-ప్రణవ్ చోప్రా తొలి రౌండ్లోనే ఓడారు. సిక్కి-ప్రణవ్ 18-21, 15-21తో మార్కస్ ఇలిస్-లారెన్ స్మిత్ (ఇంగ్లాండ్)తో చేతిలో పరాజయం చవిచూశారు.