☰
ఆదివారం, ఏప్రిల్ 18, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Published : 03/03/2021 01:10 IST
పిచ్‌.. పిచ్‌.. పిచ్‌!

భారత్‌-ఇంగ్లాండ్‌ మూడో టెస్టు ముగిసి ఆరు రోజులవుతోంది. ఆ మ్యాచ్‌ జరుగుతున్నపుడు.. ఆ తర్వాత చర్చలన్నీ పిచ్‌ చుట్టూనే తిరిగాయి. గురువారం ఆరంభమయ్యే నాలుగో టెస్టు ముంగిట కూడా మార్పేమీ లేదు. అందరి దృష్టీ పిచ్‌ మీదే ఉంది. ఈ మ్యాచ్‌కు వికెట్‌ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతోంది.

ఈనాడు క్రీడావిభాగం

పరిమిత ఓవర్ల క్రికెట్‌కు పిచ్‌లు ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ టెస్టు సిరీస్‌ అంటే మాత్రం సాధారణంగా ఆతిథ్య జట్టుకు అనుకూలంగా పిచ్‌ సిద్ధం కావడం మామూలే. ఉపఖండ జట్లు ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ దేశాలకు వెళ్లినపుడు పేస్‌ పిచ్‌లే స్వాగతం పలుకుతాయి. ఆ జట్లు ఉపఖండానికి వస్తే స్పిన్‌ వికెట్లు పలకరించడమూ మామూలే. అయితే ఈ సానుకూలత ఏమేరకు ఉంటుందన్నది ఆయా జట్ల విచక్షణ మేరకు ఆధారపడి ఉంటుంది. చెన్నైలో తొలి టెస్టుకు ఎక్కువగా బ్యాటింగ్‌కు  సహకరిస్తూ, చివరి రెండు మూడు రోజుల్లో స్పిన్‌కు సహకరించే పిచ్‌ను సిద్ధం చేశాడు    క్యురేటర్‌. అయితే టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ తొలి రెండు రోజుల్లో పరుగుల పండుగ చేసుకుంది. తర్వాత స్పిన్‌తో భారత్‌ను దెబ్బ తీసింది. కోహ్లీసేనను అనూహ్య పరాజయం పలకరించింది. దీంతో తర్వాతి మ్యాచ్‌కు భారత్‌ తన బలాన్ని నమ్ముకుంది. స్పిన్‌ పిచ్‌తో పర్యటక జట్టును దెబ్బకు దెబ్బ తీసింది. ఇక మొతేరాలో ఏం   జరిగిందో తెలిసిందే. మళ్లీ స్పిన్‌ వికెట్టే సిద్ధమైంది. గులాబి బంతితో స్పిన్నర్లు మరింతగా విజృంభించారు. భారత బ్యాట్స్‌మెన్‌ సైతం తడబడ్డప్పటికీ.. మన జట్టులో నాణ్యమైన స్పిన్నర్లుండటం కలిసొచ్చి ఇంగ్లిష్‌ జట్టుకు పరాభవం తప్పలేదు. అయితే సొంతగడ్డపై పేస్‌, స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌లతో ఇంగ్లాండ్‌ ఉపఖండ జట్లను దెబ్బ తీస్తున్నపుడు మహ బాగా ఆస్వాదించే ఆ జట్టు మద్దతుదారులు మొతేరా పిచ్‌పై గగ్గోలు పెట్టేశారు. ఇలా అయితే టెస్టు క్రికెట్‌ చచ్చిపోతుందన్నట్లుగా మాట్లాడేశారు. ఈ వ్యాఖ్యలకు మన వాళ్లు దీటుగానే స్పందించారు. పేస్‌ పిచ్‌లపై రెండు మూడు రోజుల్లో ముగిసిన మ్యాచ్‌ల మాటేంటి అన్నారు. భారత జట్టు ఎప్పుడైనా పేస్‌ పిచ్‌లపై ఫిర్యాదులు చేసిందా అని ప్రశ్నించారు. దీనికి అటు వైపు నుంచి సమాధానం లేదు. అయితే గత మ్యాచ్‌ సంగతలా వదిలేస్తే.. చివరి టెస్టుకు పిచ్‌ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు అమితాసక్తిని రేకెత్తిస్తున్న విషయం.
అలా అయితే ఉండదు..: గత మ్యాచ్‌ మాదిరి చివరి టెస్టు రెండు రోజుల్లో అయితే ముగిసిపోదన్నది స్పష్టం. ఎందుకంటే ఈ మ్యాచ్‌కు ఎప్పట్లాగే ఎరుపు బంతి వాడుతున్నారు. కాబట్టి బ్యాటింగ్‌ మరీ కష్టం కాకపోవచ్చు. బౌలర్ల ఆధిపత్యం తగ్గొచ్చు. కానీ భారత కెప్టెన్‌ అజింక్య రహానె సహా కొందరు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే..  ఈ మ్యాచ్‌కూ వికెట్‌ స్పిన్నర్లకు అనుకూలంగానే ఉంటుంది. కానీ బ్యాటింగ్‌ అంత కష్టంగా ఉండదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పిచ్‌ స్పిన్నర్ల దాసోహం అంటే.. ఇంగ్లిష్‌ జట్టు ఐసీసీకి ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు రాకున్నా ఐసీసీ.. మ్యాచ్‌ రిఫరీని పిచ్‌పై నివేదిక కోరవచ్చు.   ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా అవతరించిన మొతేరాకు ఆరంభంలోనే ఇది ఒక మచ్చగా మారొచ్చు. ఇక్కడ ఫ్రాంఛైజీ లేకపోయినా బీసీసీఐ ఐపీఎల్‌ మ్యాచ్‌లకు వేదికగా ఎంపిక చేయడం, అలాగే టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లనూ నిర్వహించాలని భావిస్తుండటంతో మొతేరా ప్రతికూల కారణాలతో వార్తల్లో నిలవాలని కోరుకోదు. కాబట్టి చివరి టెస్టుకు సమతూకం ఉన్న పిచ్‌నే ఎంపిక చేసే  అవకాశాలున్నాయి. అలాగని ఒకేసారి బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలంగా మార్చేందుకూ ఆస్కారం లేదు. అలా చేస్తే ఇంతలో అంత మార్పా అన్న ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడాలంటే ఈ మ్యాచ్‌ను కనీసం   డ్రా చేసుకోవాలి. కాబట్టి ఇంగ్లిష్‌ జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే భారత్‌ భావిస్తుంది.    ఆ జట్టును మరోసారి స్పిన్‌తో దెబ్బ తీసేలా ఉంటూనే.. గత మ్యాచ్‌తో పోలిస్తే బ్యాట్స్‌మెన్‌కు అవకాశం ఉండేలా సమతూకం ఉన్న వికెట్టే మొతేరాలో సిద్ధమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:

మరిన్ని

  • ఫుట్‌బాల్‌ దిగ్గజం అహ్మద్‌ హుస్సేన్‌ మృతి భారత ఫుట్‌బాల్‌ స్వర్ణయుగంలో భాగమైన అహ్మద్‌ హుస్సేన్‌ ఇక లేరు. 89 ఏళ్ల ఈ మాజీ ఫుట్‌బాల్‌ ఆటగాడు, ఒలింపియన్‌ కరోనాతో బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆడే రోజుల్లో అత్యుత్తమ డిఫెండర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన
  • పాపం.. ఆర్చరీ జట్టు భారత కాంపౌండ్‌ ఆర్చరీ జట్టు సభ్యులు రాత్రి నడిరోడ్డుపై కొన్ని గంటలపాటు గడపాల్సి వచ్చింది. ఓ తప్పుడు కరోనా పాజిటివ్‌ ఫలితం వల్ల ఆ జట్టు ఆర్చరీ ప్రపంచకప్‌ నుంచి వైదొలగాల్సి వచ్చింది. వాళ్ల గురించి భారత ఆర్చరీ సమాఖ్య (ఏఏఐ) పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి.
  • రవికి స్వర్ణం.. భారత యువ రెజ్లర్‌ రవి దహియా సత్తా చాటాడు. ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అతడు టైటిల్‌ నిలబెట్టుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల 57 కేజీల విభాగం ఫైనల్లో రవి 9-4తో అలీ రజా (ఇరాన్‌)ను ఓడించి పసిడి కైవసం చేసుకున్నాడు. మరోవైపు స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా
  • మీరాబాయి ప్రపంచ రికార్డు భారత స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆసియా వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 49 కేజీల విభాగంలో క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 119 కేజీలు ఎత్తి జియాంగ్‌ (చైనా, 118 కేజీలు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఆమె బద్దలు కొట్టింది.
  • హైదరాబాద్‌లో ప్రపంచకప్‌ సంబరం టీ20 ప్రపంచకప్‌ తొలిసారి హైదరాబాద్‌కు రానుంది. ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో జరగబోయే ఈ మెగా టోర్నీ వేదికల్లో హైదరాబాద్‌ కూడా ఎంపికైంది. మొత్తం తొమ్మిది వేదికల్లో పొట్టి ప్రపంచకప్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
  • సామ్స్‌కు నెగెటివ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆల్‌రౌండర్‌ డేనియల్‌ సామ్స్‌ కరోనా నుంచి కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన రెండు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లోనూ నెగెటివ్‌ రావడంతో అతను బయో బబుల్‌లో ఉన్న ఆర్‌సీబీ బృందంలో చేరాడు.
  • మళ్లీ ఢమాల్‌ లక్ష్యం చిన్నదైనా, పెద్దదైనా.. ఛేదనను ఘనంగా ఆరంభించడం.. లక్ష్యం దిశగా పరుగులు పెట్టడం.. ఇక గెలుపు లాంఛనమే అనుకున్నాక ఉన్నట్లుండి కుప్పకూలిపోవడం.. ఇదీ ఈ ఐపీఎల్‌ సీజన్లో సన్‌రైజర్స్‌ హైదరబాద్‌ వరస! తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇదే జరిగింది. మూడో మ్యాచ్‌లోనూ కథ ఏమీ మారలేదు

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • జూనియర్‌ ఆర్టిస్టుగానూ ఛాన్స్‌ ఇవ్వలేదు!
  • రాశిఫలం
  • ఉన్నదంతా ఊడ్చేసి.. కొన ఊపిరితో వదిలేసి..
  • పెళ్లయ్యాక ప్రేమాయణం.. యువకుడి ఆత్మహత్య
  • ఊరినే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు!
  • Double Maskతో మరింత మేలు!
  • టీకాతో ఇన్‌ఫెక్షన్‌ ఆగదు..!
  • Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
  • ప్రేమించిన యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడని..
  • సోషల్‌మీడియా శ్రీమహాలక్ష్ములు...
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.