☰
మంగళవారం, ఏప్రిల్ 20, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Published : 03/03/2021 01:07 IST
రికార్డుల ముంగిట కోహ్లి

దిల్లీ: రికార్డుల వేటగాడు విరాట్‌ కోహ్లి.. ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో కొన్ని ఘనతలు అందుకునే అవకాశాలున్నాయి. భారత్‌ తరఫున అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన మహేంద్రసింగ్‌ ధోని (60 టెస్టులు) రికార్డును అహ్మదాబాద్‌లో అతను సమం చేయనున్నాడు. కెప్టెన్‌గానే కాదు బ్యాట్స్‌మన్‌గా కూడా కొన్ని రికార్డులు విరాట్‌ ముంగిట ఉన్నాయి. అతడు మరో 17 పరుగులు చేస్తే కెప్టెన్‌గా 12,000 అంతర్జాతీయ పరుగులు  పూర్తి చేసుకుంటాడు. అతనికన్నా ముందు రికీ పాంటింగ్‌ (15,440), గ్రేమ్‌ స్మిత్‌ మాత్రమే (14,878) ఈ ఘనత సాధించారు. అహ్మదాబాద్‌ టెస్టులో సెంచరీ చేస్తే కెప్టెన్‌గా అత్యధిక శతకాలు (అన్ని ఫార్మాట్లలో కలిపి) సాధించిన సారథిగా రికీ పాంటింగ్‌ (41)ను విరాట్‌ దాటేస్తాడు. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా గెలిస్తే.. అత్యధిక విజయాలు సాధించిన టెస్టు సారథుల్లో గ్రేమ్‌ స్మిత్‌ (53), రికీ పాంటింగ్‌ (48), స్టీవ్‌ వా (41)ల తర్వాతి స్థానంలో ఉన్న క్లైవ్‌ లాయిడ్‌ (36)ను విరాట్‌ సమం చేస్తాడు.

Tags:

మరిన్ని

  • ఈ వయసులో గ్యారంటీ ఇవ్వలేను: ధోనీ  సోమవారం రాత్రి వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోనీసేన 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
  • మహిళలకు ‘టెస్టు’ ఉండాలి మహిళల క్రికెట్‌ ఎదగాలంటే పరిమిత ఓవర్ల ఆటపైనే దృష్టి పెట్టాలని, కానీ టెస్టు ఫార్మాట్‌ను మర్చిపోకూడదని మాజీ క్రికెటర్లు బెలిండా క్లార్క్‌, ఇయాన్‌ బిషప్‌ అభిప్రాయపడ్డారు. తమ పూర్తిస్థాయి సభ్యత్వ దేశాల అమ్మాయిల
  • హార్దిక్‌ అందుకే బౌలింగ్‌ చేయట్లేదు: జయవర్దనె భుజం ఇబ్బంది పెడుతుండటం వల్లే ఈ ఐపీఎల్‌ సీజన్లో ఇప్పటిదాకా తమ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌ చేయలేదని ముంబయి ఇండియన్స్‌ ప్రధాన కోచ్‌ మహేల జయవర్దనె తెలిపాడు. రాబోయే మ్యాచ్‌ల్లో అతను
  • భారత్‌కు నాలుగు పతకాలు ఖాయం ప్రపంచ యువ బాక్సింగ్‌ పోటీల్లో భారత్‌కు నాలుగు పతకాలు ఖాయమయ్యాయి. నలుగురు భారత బాక్సర్లు వింకా, అల్ఫియా పఠాన్‌, గీతిక, పూనమ్‌లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. మహిళల క్వార్టర్స్‌లో వింకా
  • ఇండియా ఓపెన్‌ వాయిదా కరోనా మహమ్మారి మరోసారి క్రీడలపై పడగ విసురుతోంది. దేశంలో వైరస్‌ రెండో దశ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతుండడంతో ఇండియా ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నీని వాయిదా వేస్తున్నట్లు భారత
  • ఐరోపా ఫుట్‌బాల్‌లో చీలిక.. కొత్తగా సూపర్‌ లీగ్‌ ప్రతిష్ఠాత్మక ఐరోపా ఫుట్‌బాల్‌ సంఘాల కూటమి (యూఈఎఫ్‌ఏ)లో చీలిక ఏర్పడింది. ఇంగ్లాండ్‌, స్పెయిన్‌, ఇటలీకి చెందిన 12 ఎలైట్‌ క్లబ్బులు యూఈఏఫ్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించే ఛాంపియన్స్‌ లీగ్‌ నుంచి బయటకొచ్చి
  • చెన్నై చెడుగుడు ఐపీఎల్‌-2020లో పేలవమైన ఆటతీరుతో నిరాశపరిచిన చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి గాడిన పడ్డట్లే ఉంది. గత మ్యాచ్‌లో పంజాబ్‌ను చిత్తుగా ఓడించిన ఈ మాజీ ఛాంపియన్‌.. సోమవారం రాజస్థాన్‌పై తన ప్రతాపం చూపించింది. మొదట జట్టులో ఎవరూ భారీ స్కోరు చేయకున్నా సరే.. క్రీజులోకి దిగిన ప్రతి బ్యాట్స్‌మెన్‌ దంచు దంచు అన్నట్లుగా రెచ్చిపోవడంతో భారీ స్కోరు చేసిన సూపర్‌కింగ్స్‌.. తర్వాత

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • కొవిడ్‌-19 ఎందుకింత ఉద్ధృతం?ఎప్పుడు ప్రమాదకరం?
  • కార్చిచ్చులా కరోనా
  • మీ పేరుపై ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసుకోండి
  • తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..
  • Horoscope: ఈ రోజు రాశి ఫలం
  • నా భర్తను ముద్దు పెట్టుకుంటా..ఏం చేస్తారు..
  • India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు
  • చెన్నై చెడుగుడు
  • ఆ డేటా ఫోన్‌లో ఉంటే డిలీట్‌ చేయండి: ఎస్‌బీఐ
  • తెలంగాణలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.