☰
గురువారం, ఫిబ్రవరి 25, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Updated : 16/01/2021 02:57 IST
కంగారూను పట్టలేక..

ఆస్ట్రేలియా 274/5
కొనసాగిన భారత ఫీల్డింగ్‌ వైఫల్యం
తొలి రోజు ఆట ఆసీస్‌దే
లబుషేన్‌ శతకం
బ్రిస్బేన్‌

పేస్‌ ప్రధానాస్త్రం బుమ్రా లేడు.. స్పిన్‌ భారాన్ని మోసే అశ్విన్‌ లేడు.. మూడో టెస్టు మాత్రమే ఆడుతోన్న సిరాజే ఎక్కువ అనుభవజ్ఞుడు.. ఇద్దరు బౌలర్లు అరంగేట్రం చేశారు.. ఇదీ ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారత బౌలింగ్‌ దళం పరిస్థితి. అయితేనేం..
మన బౌలర్లు మెరుగైన ప్రదర్శనే చేశారు. ఓపెనర్లను త్వరగానే ఔట్‌ చేసి జట్టుకు ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం కల్పించారు. కానీ మరోసారి ఫీల్డింగ్‌ వైఫల్యం.. జట్టును వెనక్కిలాగింది. టీమ్‌ఇండియా ఫీల్డర్ల తప్పిదాలతో బతికిపోయిన లబుషేన్‌ శతకంతో ఆస్ట్రేలియాను ముందంజలో నిలిపాడు. తొలి రోజు ఆటలో ఆధిపత్యం ఆతిథ్య జట్టుదే.

బోర్డర్‌- గావస్కర్‌ సిరీస్‌లో చివరిదైన నాలుగో టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. పెద్దగా అనుభవం లేని టీమ్‌ఇండియా బౌలర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేసినప్పటికీ.. లబుషేన్‌ (108; 204 బంతుల్లో 9×4) సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియా మెరుగైన స్థితిలో నిలిచింది. తొలి రోజు, శుక్రవారం టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ ఆట ఆఖరుకు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 274 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్‌ (1), హారిస్‌ (5)ను భారత బౌలర్లు త్వరగానే పెవిలియన్‌ చేర్చినప్పటికీ..  స్మిత్‌ (36), వేడ్‌ (45; 87 బంతుల్లో 6×4)లతో కలిసి లబుషేన్‌ ఆ జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్‌ పైన్‌ (38 బ్యాటింగ్‌), ఆల్‌రౌండర్‌ కామెరూన్‌  గ్రీన్‌ (28 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో నటరాజన్‌ (2/63) రెండు వికెట్లు   పడగొట్టాడు. ఈ మ్యాచ్‌తోనే నటరాజన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ టెస్టు అరంగేట్రం చేశారు. జడేజా, అశ్విన్‌, విహారి, బుమ్రా గాయపడ్డ నేపథ్యంలో వీరితో పాటు మయాంక్‌ అగర్వాల్‌, శార్దూల్‌ ఠాకూర్‌ తుది జట్టులోకి వచ్చారు.
ఓపెనర్లను త్వరగానే..: గత 31 టెస్టుల్లో ఓటమే (24 విజయాలు, 7డ్రాలు) లేదు..    చివరగా ఆడిన ఏడు టెస్టుల్లోనూ విజయం    ఆ జట్టుదే.. గబ్బాలో ఇలాంటి గొప్ప రికార్డున్న ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. పెద్దగా అనుభవం లేని భారత బౌలింగ్‌ దళం  ఏ మేరకు నిలువరిస్తుందోనన్న అనుమానాలు  కలిగాయి. కానీ సిరాజ్‌ (1/51) ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే వార్నర్‌ను ఔట్‌ చేసి ఆ జట్టుకు షాకిచ్చాడు. మంచి లైన్‌, లెంగ్త్‌లో పడ్డ బంతిని డిఫెన్స్‌ చేయాలని వార్నర్‌ ప్రయత్నించాడు. అయితే కాస్త స్వింగ్‌ అయి ఎడ్జ్‌ తీసుకుని తక్కువ ఎత్తులో వచ్చిన ఆ బంతిని సెకండ్‌ స్లిప్‌లో ఉన్న రోహిత్‌ కుడివైపు డైవ్‌ చేసి అద్భుత రీతిలో అందుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే హారిస్‌ను శార్దూల్‌ (1/67) తన తొలి బంతికే పెవిలియన్‌ చేర్చడంతో ఆ జట్టు 17 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. ఈ దశలో లబుషేన్‌, స్మిత్‌ కలిసి జట్టును కాపాడే బాధ్యత తీసుకున్నారు. లబుషేన్‌ మరీ నెమ్మదిగా ఆడాడు. తొలి 50 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేశాడు. కానీ మరోవైపు స్మిత్‌.. శార్దూల్‌ను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు రాబట్టాడు.

అతను నిలిచి..: మూడో వికెట్‌కు 70  పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న లబుషేన్‌, స్మిత్‌ జోడీని లంచ్‌ విరామం తర్వాత సుందర్‌ (1/63)   విడగొట్టాడు. లెగ్‌సైడ్‌ ఫీల్డర్లను మోహరించి.. ఆ దిశగా ఆడేలా స్మిత్‌ను ఉసిగొల్పి వికెట్‌ సాధించడం విశేషం. ఆ వెంటనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న లబుషేన్‌.. వేడ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. సైని గాయంతో మైదానం వీడడంతో..  నలుగురే బౌలింగ్‌ చేయాల్సి వచ్చింది. భారత ఫీల్డర్ల వైఫల్యంతో బతికిపోయిన లబుషేన్‌ సెంచరీ పూర్తి చేశాడు. వేడ్‌ కూడా ధాటిగా ఆడటంతో భారత్‌కు కష్టాలు పెరిగాయి. అయితే నటరాజన్‌ మళ్లీ భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. నాలుగో వికెట్‌కు 113 పరుగులు జోడించిన లబుషేన్‌, వేడ్‌లను వరుస ఓవర్లలో ఔట్‌ చేశాడు. కానీ తర్వాత బౌలర్లు ఒత్తిడి కొనసాగించలేక పోయారు. దీంతో మరో వికెట్‌ పడకుండానే ఆట ముగిసింది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) రోహిత్‌ (బి) సిరాజ్‌ 1; హారిస్‌ (సి) సుందర్‌ (బి) శార్దూల్‌ 5; లబుషేన్‌ (సి) పంత్‌ (బి) నటరాజన్‌ 108; స్మిత్‌ (సి) రోహిత్‌ (బి) సుందర్‌ 36; వేడ్‌ (సి) శార్దూల్‌ (బి) నటరాజన్‌ 45; గ్రీన్‌ బ్యాటింగ్‌ 28; పైన్‌ బ్యాటింగ్‌ 38; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం: (87  ఓవర్లలో 5 వికెట్లకు) 274; వికెట్ల పతనం: 1-4, 2-17, 3-87, 4-200, 5-213; బౌలింగ్‌: సిరాజ్‌ 19-8-51-1; నటరాజన్‌ 20-2-63-2; శార్దూల్‌ 18-5-67-1; సైని 7.5-2-21-0; వాషింగ్టన్‌ సుందర్‌ 22-4-63-1; రోహిత్‌ శర్మ 0.1-0-1-0


ఈసారి సైని..

భారత జట్టును ఆటగాళ్ల గాయాల సమస్య వదిలేలా లేదు. ఇప్పటికే కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోయిన ఆ జట్టు.. నాలుగో టెస్టుకు పదకొండు మందిని ఎంపిక చేయడం కోసం తంటాలు పడింది. ఈ పరిస్థితుల్లో పేసర్‌ సైని గజ్జల్లో నొప్పితో తొలి రోజు ఆటలో మైదానం వీడడం ఆందోళన కలిగిస్తోంది. రెండో సెషన్‌లో ఇన్నింగ్స్‌ 36వ (అతడికి ఎనిమిదోది) ఓవర్లో అయిదో బంతి వేసిన తర్వాత అతను నొప్పితో మైదానాన్ని వీడాడు. సైనిని స్కానింగ్‌ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. రెండో రోజు అతను మైదానంలోకి వస్తాడో లేదో తెలియదు.


ఆ ఇద్దరు తప్ప..

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో పూర్తిగా నాలుగు టెస్టులు ఆడిన భారత ఆటగాళ్లు కేవలం ఇద్దరే. వాళ్లలో తాత్కాలిక కెప్టెన్‌ రహానె ఒకరు కాగా.. మరొకరు పుజారా. ఆటగాళ్ల ప్రదర్శన, గాయాల సమస్య కారణంగా తొలి మ్యాచ్‌ తర్వాత ప్రతి టెస్టుకూ జట్టులో మార్పులు అనివార్యమయ్యాయి. తొలి టెస్టు తర్వాత రెండో మ్యాచ్‌ కోసం జట్టులో నాలుగు మార్పులు జరిగాయి. మూడో టెస్టు తుది జట్టులో రెండు మార్పులు చేశారు. ఇక నాలుగో టెస్టు కోసం మరోసారి నాలుగు మార్పులు చేయాల్సి వచ్చింది.


4

ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో అయిదుగురు భారత బౌలర్ల మొత్తం అనుభవం 4 టెస్టులే. ఈ సిరీస్‌లోనే రెండో టెస్టులో అరంగేట్రం చేసిన సిరాజ్‌కే ఈ మ్యాచ్‌లో ఆడుతున్న మిగతావాళ్ల కంటే ఎక్కువ అనుభవం (2 టెస్టులు) ఉంది. మూడో టెస్టులో అరంగేట్రం చేసిన సైనీకి ఇది రెండో మ్యాచ్‌. శార్దూల్‌కు కూడా ఇది రెండో టెస్టే. నటరాజన్‌, సుందర్‌ అరంగేట్ర ఆటగాళ్లు.


2

మూడు అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌లో ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే అన్ని మ్యాచ్‌ల్లో ఆడడం క్రికెట్‌ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. 1995లో విజ్డెన్‌ ట్రోఫీలో భాగంగా వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఇద్దరు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు మాత్రమే అన్ని మ్యాచ్‌లూ (6) ఆడారు.


 

Tags:

మరిన్ని

  • మొతేరాలో వికెట్ల జాతర భారత్‌తో టెస్టు సిరీస్‌లో  ఇంగ్లాండ్‌ గెలవడానికి  మంచి అవకాశమున్నది మొతేరాలోనే’’ సిరీస్‌ ఆరంభానికి ముందు చాలామంది విశ్లేషకుల మాట ఇది. అహ్మదాబాద్‌ రావడానికి ముందే చెన్నైలో ఓ అనూహ్య విజయాన్నందుకున్న ఇంగ్లిష్‌ జట్టు.. మొతేరా మనదేలే అన్న ఆశతోనే ఇక్కడ అడుగు పెట్టి ఉంటుందేమో! గులాబి బంతితో భారత జట్టును దెబ్బ తీద్దామని ముగ్గురు స్పెషలిస్టు పేసర్లనూ
  • భారత్‌ × బంగ్లాదేశ్‌ రహదారి భద్రత ప్రపంచ సిరీస్‌ క్రికెట్‌ టోర్నీ ఆరంభ పోరులో భారత దిగ్గజాల జట్టుతో బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది. మార్చి 5న రాయ్‌పూర్‌లోని షహీద్‌ వీర్‌ నారాయణ్‌సింగ్‌ అంతర్జాతీయ స్టేడియంలో
  • మైదానంలో కోహ్లి అభిమాని.. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా విరాట్‌ కోహ్లి అభిమాని అందరి దృష్టిని ఆకర్షించాడు. తన అభిమాన క్రికెటర్‌ను సమీపంగా చూసేందుకు ఆ అభిమాని భద్రతను ఛేదించుకుని మైదానంలోకి దూసుకెళ్లాడు.
  • వంద టెస్టులు గొప్ప మైలురాయి: సచిన్‌ వందో టెస్టు ఆడుతున్న టీమ్‌ఇండియా పేసర్‌ ఇషాంత్‌శర్మను దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ ప్రశంసించాడు. ‘‘ఏ ఆటగాడికైనా వంద టెస్టులు ఆడటం గొప్ప మైలురాయి. మరీ ముఖ్యంగా ఫాస్ట్‌ బౌలర్‌కు. అండర్‌-19 క్రికెట్‌
  • హైదరాబాద్‌ ఓటమి విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌కు తొలి ఓటమి ఎదురైంది. వరుసగా రెండు విజయాలతో అలరించిన హైదరాబాద్‌కు మూడో మ్యాచ్‌లో చుక్కెదురైంది. బుధవారం గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో బరోడా
  • బంతికి ఉమ్ము రాసిన స్టోక్స్‌ కరోనా కారణంగా బంతిపై ఉమ్ము రాయడాన్ని ఐసీసీ గత జూన్‌లోనే నిషేధించింది. అయినా అలవాటు వల్ల అప్పుడప్పుడు ఆ పని చేస్తూనే ఉన్నారు. తాజాగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా
  • బెడిసికొట్టిన‘బ్యాక్‌ఫుట్‌’ స్పిన్‌ ఆడటంలో ఇంగ్లాండ్‌ బలహీనత తెలిసిందే. అయితే మొతేరాలో మరీ ఇలా కుప్పకూలిపోతుందని ఎవరూ అనుకోలేదు. పిచ్‌పై పచ్చికంతా తొలగిపోవడం చూడగానే ఇది స్పిన్‌ పిచ్‌ అని ఆ జట్టుకు అర్థమయ్యే ఉంటుంది.
  • సింధుకు సులువు.. సైనాకు కష్టం ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణులు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. మార్చి 17 నుంచి 21 వరకు బర్మింగ్‌హామ్‌లో జరిగే ఈ టోర్నీలో
  • టైగర్‌కు ప్రాణాపాయం లేదు గోల్ఫ్‌ స్టార్‌ టైగర్‌వుడ్స్‌ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం వుడ్స్‌ నడిపిస్తున్న కారు బోల్తా కొట్టి రహదారి పక్కన లోతుగా ఉన్న ప్రదేశంలో పడిపోయింది. ప్రమాద సమయంలో అతడొక్కడే కారులో
  • జ్యోతి సంచలనం స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నీలో భారత క్రీడాకారిణి జ్యోతి గులియా సంచలనం సృష్టించింది. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ నజిమ్‌ కిజైబే (కజకిస్తాన్‌)కు షాకిచ్చింది. బుధవారం జరిగిన
  • విమర్శలొస్తే రానీ.. చెన్నై చెపాక్‌లో రెండో టెస్టులో  స్పిన్‌ పిచ్‌పై గింగిరాలు తిరిగే బంతుల్ని ఎదుర్కోలేక ఉక్కిరిబిక్కిరైపోయింది ఇంగ్లిష్‌ జట్టు. దీంతో ఇంగ్లాండ్‌ మద్దతుదారులు ఇది టెస్టు మ్యాచ్‌కు సరిపోయే పిచ్‌ కాదని, మరీ ఇంతగా స్పిన్నర్లకు
  • ఈ వెలుగులో కొంచెం కష్టమే స్టేడియంలో లైట్ల  వెలుతురులో గులాబి బంతిని గుర్తించడంతో ఇబ్బందులున్నాయని భారత కెప్టెన్‌ కోహ్లి అన్నాడు. ‘‘స్టేడియంలో వాతావరణం చాలా ఉత్తేజితంగా ఉంది. కానీ లైట్ల వెలుతురే నాకు కాస్త ఆందోళన కలిగిస్తోంది.
  • ఆట మొదలు.. మొతేరాలోని ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంలో సందడి మొదలైంది.  ‘నరేంద్ర మోదీ స్టేడియం’గా పేరు మారిన సర్దార్‌ పటేల్‌ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలున్న...

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • సుకుమార్‌ ఫ్యామిలీ ఫంక్షన్‌లో తారల సందడి
  • ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేం: మోదీ
  • ప్రేమ తీసిన ప్రాణం
  • పాత్రలో లీనం.. నాటకంలో హత్యాయత్నం
  • అమ్మ స్తనంపై పాముకాటు
  • ప్రియురాలు.. ప్రియుడు.. ఓ బాధితుడు
  • అంపైర్‌ నిర్ణయాలతో అసహనం..!
  • అమెజాన్‌ ప్రైమ్‌ రూ.20 మాత్రమే!
  • బస్సు చక్రాల కింద నలిగి గర్భిణి దుర్మరణం
  • ఒకే హాస్టల్‌లో 190 మందికి కరోనా!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.