☰
సోమవారం, మార్చి 01, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 22/01/2021 06:45 IST
ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!

మరి డేవిడ్‌ వార్నర్‌కు ఎందుకీ అన్యాయమని ఇయాన్ ఛాపెల్‌ ప్రశ్న

సిడ్నీ: టిమ్‌పైన్‌ స్థానంలో మరొకరు దొరక్కపోతే స్టీవ్‌స్మిత్‌కే మళ్లీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ఆసీస్‌ మాజీ సారథి ఇయాన్‌ ఛాపెల్‌ అంటున్నారు. 2018 బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంలో పాత్రధారి అయినప్పటికీ అతడివైపే మొగ్గు చూపొచ్చని అంచనా వేశారు. అతడితో పాటు ప్యాట్‌ కమిన్స్‌ రేసులో ముందున్నాడని పేర్కొన్నారు. టీమ్‌ఇండియాతో సిరీసులో కీపింగ్‌, సారథ్యం, వ్యూహాలపై విమర్శలు రావడంతో పైన్‌ తొలగింపుపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.

‘అవును, బహుశా స్మిత్‌కు మళ్లీ సారథ్యం దక్కొచ్చు. ఇంకొకరు దొరక్కపోతే అలా జరుగుతుందని అనుకుంటున్నా’ అని ఛాపెల్‌ అన్నారు. నాయకత్వానికి స్మిత్‌కు అర్హత ఉన్నప్పుడు డేవిడ్‌ వార్నర్‌కు జీవితకాల నిషేధం ఎందుకు విధించారని ఆయన ప్రశ్నించారు. తన దృష్టిలో బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంలో వార్నర్‌ కన్నా స్మిత్‌ చేసిన నేరమే పెద్దదని చెప్పారు.

‘స్మిత్‌, వార్నర్‌ ఒకే విభాగం కిందకు ఎందుకు రావడం లేదు? నాయకత్వంపై స్మిత్‌కు రెండేళ్ల నిషేధం ఉంటే వార్నర్‌కూ అంతే శిక్ష ఎందుకు లేదు? లేదా సారథ్యంపై వార్నర్‌కు జీవితకాల నిషేధం విధిస్తే స్మిత్‌ను ఎందుకు వదిలేశారు? నా దృష్టిలో వార్నర్‌ కన్నా స్మిత్‌ పెద్ద నేరస్థుడు’ అని ఇయాన్‌ ఛాపెల్‌ కుండబద్దలు కొట్టారు. దక్షిణాఫ్రికాపై 2018లో వార్నర్‌ బాల్‌ ట్యాంపరింగ్‌ పథకం వేయగా స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌ ఇందుకు సహకరించారని ఆసీస్‌ విచారణలో తేలిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి
స్పైడర్‌ పంత్‌..!
విశ్రమించను.. విజయం తలకెక్కించుకోను: సిరాజ్‌

Tags: Sports Newsస్పోర్ట్స్‌ న్యూస్‌Cricket Newsక్రికెట్‌ న్యూస్‌Steve smithస్టీవ్‌స్మిత్‌David warnerడేవిడ్‌ వార్నర్‌Ian Chappellఇయాన్‌ ఛాపెల్‌

మరిన్ని

  • అశ్విన్‌.. ఇంగ్లాండ్‌ను ఎక్కడా వదలట్లేదు  [01:25]
  • భయపడతారని భారత్‌ ముందే ఊహించింది[01:08]
  • మొతేరా పిచ్‌పై ఎందుకలా ఏడుస్తున్నారు?[01:18]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..!
  • బన్నీ సినిమాలో స్టార్‌ హీరో కుమార్తె..?
  • సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..
  • తల్లికాబోతున్న హీరోయిన్‌ రిచా
  • ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
  • వాహ్‌! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
  • రాళ్లు రువ్వి.. వెంబడించి
  • భార్య, బిడ్డ బతికితే చాలనుకున్నా!
  • రేపటి సిరులు
  • అలా చేశాక జుట్టు ఊడుతుంది?
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.