బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా యువ వికెట్ కీపర్ రిషభ్‌పంత్(51*) అర్ధశతకం సాధించాడు. పుజారా(56) ఔటయ్యాక మయాంక్ అగర్వాల్(9*)తో జోడీ కట్టిన యువ బ్యాట్స్‌మన్ ధాటిగా ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే హేజిల్‌వుడ్ వేసిన 84వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి టెస్టుల్లో నాలుగో అర్ధశతకం సాధించాడు. ఇక మూడో సెషన్‌లో డ్రింక్స్ విరామ సమయానికి టీమ్‌ఇండియా 85 ఓవర్లకు 259/4 స్కోర్ సాధించింది. టీమ్‌ఇండియా విజయానికి ఇంకా 69 పరుగుల దూరంలో నిలిచింది.
ఇవీ చదవండి..
అదే మన ఆఖరి ఫొటో అవుతుందని తెలియదు..
ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం