☰
సోమవారం, మార్చి 01, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 25/01/2021 07:42 IST
అంతకంటే గొప్పేముంటుంది?

దిల్లీ: టీమ్‌ఇండియాకు విజయాలు అందించడం కంటే గొప్పేముంటుందని వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ అన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత ప్రదర్శనతో సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన అతను మాట్లాడుతూ.. ‘‘2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో జట్టుకు అవసరమైన సమయంలో ఔటవడంతో గుండె పగిలినట్లనిపించింది. అలాంటి అవకాశం మళ్లీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశా. నమ్మశక్యం కాని ప్రదర్శనతో కఠిన పరిస్థితుల్లో ఉన్న జట్టుకు విజయాలు సాధించాలని నేనెప్పుడూ కల కంటా. ఎన్ని పరుగులు చేశానన్నది ముఖ్యం కాదు. అవి జట్టు గెలుపునకు ఉపయోగపడ్డాయా? లేదా? అనేదే ప్రధానం. బ్రిస్బేన్‌ టెస్టులో అందుకే చివరి వరకూ క్రీజులో ఉండాలనుకున్నా. సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 97 పరుగులకు ఔటైనపుడు కూడా చివరి వరకూ నిలవలేకపోయానే అని బాధపడ్డా. అందుకే చివరి టెస్టులో మాత్రం ఆ పొరపాటు మళ్లీ చేయొద్దని అనుకున్నా. సుందర్‌తో ఆడుతున్నపుడు మా ఇద్దరిలో ఒకరు నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ నడిపిస్తే.. మరొకరు భారీ షాట్లు ఆడాలనుకున్నాం. నేను షాట్లు ఆడతానంటే సుందర్‌ కూడా అదే పని చేస్తానన్నాడు. చివరికి అతనే ఆ బాధ్యత తీసుకున్నాడు. కానీ ఆఖర్లో నేను షాట్లు ఆడాల్సి వచ్చింది’’ అని పంత్‌ తెలిపాడు. మానసికంగా బలంగా మారేందుకు లాక్‌డౌన్‌ తనకు ఉపయోగపడిందని అతనన్నాడు. ‘‘లాక్‌డౌన్‌ నాకు వరంగా మారిందనే చెప్పొచ్చు. దాని కంటే ముందు ఎక్కువ ఒత్తిడికి లోనయ్యేవాణ్ని. కానీ ఆ సమయంలో కుటుంబంతో, స్నేహితులతో గడపడంతో ప్రశాంతత కలిగింది. ఇప్పుడు కాస్త పరిణతి సాధించానని అనిపిస్తోంది. నా ఆటతీరులో కొన్ని మార్పులు చేసుకున్నా. సానుకూల దృక్పథంతో ఉండి, కష్టపడితే కచ్చితంగా ఫలితం వస్తుంది’’ అని పంత్‌ పేర్కొన్నాడు.  

ఇవీ చదవండి..

పంత్‌ క్రీజులో ఉంటే బౌలర్లపైనే ఒత్తిడి: సుందర్‌

ఘనతంతా కుర్రాళ్లదే

Tags: Sports Newsక్రీడా వార్తలుCricket Newsక్రికెట్‌ వార్తలుRishabh Pantరిషభ్‌ పంత్‌ Team Indiaటీమ్‌ఇండియా

మరిన్ని

  • అశ్విన్‌.. ఇంగ్లాండ్‌ను ఎక్కడా వదలట్లేదు  [01:25]
  • భయపడతారని భారత్‌ ముందే ఊహించింది[01:08]
  • మొతేరా పిచ్‌పై ఎందుకలా ఏడుస్తున్నారు?[01:18]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..!
  • బన్నీ సినిమాలో స్టార్‌ హీరో కుమార్తె..?
  • సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..
  • తల్లికాబోతున్న హీరోయిన్‌ రిచా
  • వాహ్‌! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
  • రాళ్లు రువ్వి.. వెంబడించి
  • ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
  • భార్య, బిడ్డ బతికితే చాలనుకున్నా!
  • రేపటి సిరులు
  • అలా చేశాక జుట్టు ఊడుతుంది?
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.