☰
మంగళవారం, మార్చి 09, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 20/01/2021 01:48 IST
భారత్‌ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులు

ఇంటర్నెట్‌డెస్క్‌: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా 3 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఆసీస్‌ నిర్దేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని 97 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో 2-1 తేడాతో ఆస్ట్రేలియా గడ్డపై మరోసారి సిరీస్‌ కైవసం చేసుకుంది. 2018-19లోనూ భారత్‌ 2-1 తేడాతోనే కంగారూలపై సిరీస్‌ కైవసం చేసుకొని తొలిసారి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌటవ్వగా.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేసింది. అనంతరం కంగారూలు రెండో ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 33 కలుపుకొని భారత్‌ ముందు 327 లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా ఐదోరోజు 4/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బ్యాటింగ్ కొనసాగించి చివరి క్షణాల్లో విజయం సాధించింది. పంత్‌(89*) కీలక ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌కు విజయాన్ని చేకూర్చాడు. దీంతో భారత్‌ కంగారూ గడ్డపై రెండోసారి చిరస్మరణీయ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే టెస్టు క్రికెట్‌లో పలు రికార్డులు, విశేషాలు నమోదయ్యాయి. అవేంటో ఓసారి చూద్దామా..

టెస్టుల్లో చివరి రోజు అత్యధిక పరుగులు చేసిన సందర్భాలు..

* 1948 లీడ్స్‌ : 404(ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్‌)

* 1984 లార్డ్స్‌ ‌: 344 (వెస్టిండీస్‌ vs ఇంగ్లాండ్)

* 2020/21 బ్రిస్బేన్ : 325(భారత్‌ vs ఆస్ట్రేలియా)

* 1977/78 పెర్త్‌:  317(ఆస్ట్రేలియా vs భారత్‌)

*‌ 2017 లీడ్స్‌: 317(వెస్టిండీస్‌ vs ఇంగ్లాండ్)

 

తొలి టెస్టు ఓడాక భారత్‌ సిరీస్‌ గెలిచిన సందర్భాలు..

* 1972/73 సీజన్‌లో స్వదేశంలో ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో గెలుపు

* 2000/01 సీజన్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో గెలుపు

* 2015లో శ్రీలంక గడ్డపై ఆ జట్టుపైనే 2-1 తేడాతో విజయం

* 2016/17 సీజన్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో విజయం

* 2020/21 సీజన్‌లో ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో గెలుపు

 

ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక పరుగుల ఛేదన..

* 2008/09 : పెర్త్‌ వేదికగా జరిగిన టెస్టులో దక్షిణాఫ్రికా 414 పరుగుల రికార్డు ఛేదన

* 1928/29 : మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 332 పరుగుల ఛేదన

* 2020/21 : గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్‌ 329 పరుగుల ఛేదన

 

టెస్టుల్లో టీమ్‌ఇండియా అత్యధిక లక్ష్య ఛేదనలు..

* 1975/76 సీజన్‌లో వెస్టిండీస్‌పై 406 పరుగుల ఛేదన

* 2008/09 సీజన్‌లో ఇంగ్లాండ్‌పై 387 పరుగుల ఛేదన

* 2020/21 సీజన్‌లో ఆస్ట్రేలియాపై 328 పరుగుల ఛేదన

* 2011/12 సీజన్‌లో వెస్టిండీస్‌పై 276 పరుగుల ఛేదన

* 2001లో శ్రీలంకపై 264 పరుగుల ఛేదన

 

ఒకే వేదికపై ఓటమి లేకుండా అత్యధిక టెస్టులు ఆడిన జట్లు

* 1955-2000 వరకు కరాచి స్టేడియంలో పాకిస్థాన్‌ 34 మ్యాచ్‌లు ఆడింది

* 1989-2019 వరకు గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా 31 మ్యాచ్‌లు ఆడింది.

* 1948-1993 వరకు కెన్‌సింగ్టన్‌ ఓవల్‌ మైదానంలో వెస్టిండీస్‌ 27 మ్యాచ్‌లు ఆడింది

* 1905-1954 వరకు ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో ఇంగ్లాండ్‌ 25 మ్యాచ్‌లు ఆడింది

* 1958-1989 వరకు సెబీనా పార్క్‌లో వెస్టిండీస్‌ 19 మ్యాచ్‌లు ఆడింది.

ఇవీ చదవండి..

ధోనీని అధిగమించి పంత్ కొత్త రికార్డు.. 

భారత్‌ చిరస్మరణీయ విజయం..

భారత్‌ విజయం అమితానందాన్నిచ్చింది: మోదీ

Tags: Sports Newsక్రీడా వార్తలుCricket Newsక్రికెట్‌ వార్తలుIND vs AUSభారత్‌ vs ఆస్ట్రేలియాTeam Indiaటీమ్‌ఇండియాRishabh Pantరిషభ్ పంత్‌Border Gavaskar Trophyబోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ

మరిన్ని

  • ఆస్ట్రేలియా అవకాశాలకు గండి పడింది అక్కడే! [14:00]
  • ఈయన మన దేవుడు: సెహ్వాగ్‌  [10:11]
  • రికీ కవ్వింపు.. హహ్హహ్హ అన్న పంత్‌![02:08]
  • సెహ్వాగ్ లెఫ్ట్‌హ్యాండ్‌తో ఆడినట్లు ఉంది  [02:06]
  • ఐసీసీ మహిళల క్రికెట్‌లో కొత్త అడుగు[02:03]
  • టీ20ల్లో పంత్‌ హీరో కాగలడు: లక్ష్మణ్‌[15:53]
  • గోవాలో బుమ్రా వివాహం..![10:55]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • గాయకుడు సిద్‌ శ్రీరామ్‌కు అవమానం
  • గోవాలో బుమ్రా వివాహం..!
  • మేనకోడలితో హృతిక్‌.. మంచు లక్ష్మి క్రికెట్‌
  • మధుమేహులు పుచ్చకాయ తినొచ్చా?
  • కోహ్లీసేనకు ‘ధర్మ సంకటం’: రాహుల్‌కు చోటెక్కడ?
  • తీయటి తలనొప్పి
  • సొంతవాళ్లే నన్ను మోసం చేశారు: రాజేంద్రప్రసాద్‌
  • 100% అమ్మేస్తాం
  • కారణం లేకుండా నన్ను నిందించారు: సునీత
  • మన ఆయుధమే మనకు మృత్యువై..!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.