☰
గురువారం, ఫిబ్రవరి 25, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 15/01/2021 19:33 IST
చరిత్ర సృష్టించిన నయా యార్కర్‌ కింగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా యువ పేసర్‌ నటరాజన్‌ చరిత్ర సృష్టించాడు. ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో ఈ ఘనత సాధించాడు. కాగా, ఆస్ట్రేలియా పర్యటనకు నట్టూ తొలుత నెట్‌ బౌలర్‌ వెళ్లాడు. అయితే ఆటగాళ్ల గాయాలతో అతడికి జట్టులో చోటు దక్కింది. అనంతరం తుదిజట్టులో చోటు సంపాదించి పదునైన యార్కర్లతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేతో నటరాజన్‌ తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ను మొదలుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 13 పరుగుల తేడాతో గెలిచింది. పది ఓవర్లు వేసిన అతడు 70 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అనంతరం పొట్టిఫార్మాట్‌లోనూ చోటు సంపాదించి భారత్‌ టీ20 సిరీస్‌ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆరు వికెట్లు పడగొట్టాడు. అయితే టెస్టు సిరీస్‌కు నట్టూ ఎంపిక కాకపోయినా టీమిండియా యాజమాన్యం అతడిని జట్టుతో పాటు ఉంచింది. షమి, ఉమేశ్‌ యాదవ్‌ గైర్హాజరీతో ఆఖరి రెండు టెస్టులకు ఎంపికయ్యాడు.

మూడో టెస్టులోనే నటరాజన్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేస్తాడని భావించారంతా. కానీ బుమ్రా, సిరాజ్‌తో మూడో పేసర్‌గా సైని తుదిజట్టులోకి వచ్చాడు. అయితే బుమ్రాకు కూడా గాయమై ఆఖరి టెస్టుకు దూరమయ్యాడు. దీంతో నట్టూ నాలుగో టెస్టులో బరిలోకి దిగాడు. తొలి రోజు ఆటలో ఆకట్టుకున్నాడు. వరుస ఓవర్లలో లబుషేన్‌, వేడ్‌ వికెట్లు పడగొట్టి భారత్‌ను పోటీలోకి తీసుకువచ్చాడు. కాగా, నెట్‌ బౌలర్‌ నుంచి అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించిన నట్టూను అభినందిస్తూ బీసీసీఐ, ఐసీసీ ట్వీట్ చేసింది.

ఇదీ చదవండి

అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా‌‌!

తొలి రోజు ఆసీస్‌ 274/5  



Tags: sports newsNatarajanAustraliarecordsINDvAUS4th TestBrisbanecricketస్పోర్ట్స్‌ న్యూస్‌నటరాజన్‌క్రికెట్‌రికార్డులు

మరిన్ని

  • రెండు రోజుల సంబరం.. కోహ్లీసేన అంబరం[19:59]
  • స్పిన్‌ మాయ: ఇంగ్లాండ్‌ 81 ఆలౌట్‌[18:50]
  • రూట్‌ ‘పంచ్’: టీమ్‌ఇండియా 145కే ఆలౌట్‌‌[16:19]
  • ఇలాగైతే గిల్‌ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది[11:55]
  • అంపైర్‌ నిర్ణయాలతో అసహనం..![10:23]
  • మోదీ స్టేడియంలో కోహ్లీ ఆందోళన ఇదే![03:40]
  • సాహా కోసమే ధోనీ రిటైర్మెంట్‌: ఇషాంత్‌[01:43]
  • అనుకూలించినప్పుడే అందిపుచ్చుకోవాలి: అక్షర్‌[01:26]
  • పింక్‌ టెస్టు: 13 వికెట్లతో కొత్త రికార్డు  [14:36]
  • సెక్యూరిటీ కళ్లు గప్పి.. కోహ్లీని కలిసేందుకు  [12:34]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • సుకుమార్‌ ఫ్యామిలీ ఫంక్షన్‌లో తారల సందడి
  • ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేం: మోదీ
  • ప్రేమ తీసిన ప్రాణం
  • పాత్రలో లీనం.. నాటకంలో హత్యాయత్నం
  • ప్రియురాలు.. ప్రియుడు.. ఓ బాధితుడు
  • అమ్మ స్తనంపై పాముకాటు
  • అంపైర్‌ నిర్ణయాలతో అసహనం..!
  • అమెజాన్‌ ప్రైమ్‌ రూ.20 మాత్రమే!
  • బస్సు చక్రాల కింద నలిగి గర్భిణి దుర్మరణం
  • ఒకే హాస్టల్‌లో 190 మందికి కరోనా!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.