బ్రిస్బేన్: బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 38 ఓవర్లకు 83/1తో కొనసాగుతోంది. శుభ్‌మన్‌గిల్(64*), పుజారా(8*) నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ అర్ధశతక భాగస్వామ్యంతో బ్యాటింగ్ చేస్తున్నారు. అంతకుముందు 4/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మంగళవారం చివరిరోజు ఆట ప్రారంభించిన టీమ్‌ఇండియా ఈ సెషన్‌లో ఒక వికెట్ కోల్పోయి 79 పరుగులు చేసింది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఓపెనర్ రోహిత్ శర్మ(7) వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో కీపర్ టిమ్‌పైన్‌కు చిక్కడంతో భారత్ 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆపై గిల్, పుజారా ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. భారత్ విజయానికి ఇంకా రెండు సెషన్లలో 245 పరుగులు చేయాలి.
ఇవీ చదవండి..
రాస్మిత్ చూస్తుండగానే రోహిత్ షాడో బ్యాటింగ్
సిరాజ్.. ఇక కుర్రాడు కాదు