☰
మంగళవారం, ఏప్రిల్ 20, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 08/03/2021 01:08 IST
సాహాను ఆడిస్తే ఆ లెక్క సరిపోదు..  

హర్భజన్‌, ఆకాశ్‌ చోప్రా సంభాషణ

ఇంటర్నెట్‌డెస్క్‌: టెస్టు క్రికెట్‌లో సీనియర్‌ ఆటగాడు వృద్ధిమాన్‌ సాహాను టీమ్‌ఇండియా కొంతకాలం రెండో కీపర్‌గా కొనసాగించాలని వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్లో మాజీ బ్యాట్స్‌మన్‌ ఆకాశ్‌చోప్రాతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో విఫలమైన బెంగాల్‌ కీపర్‌.. తర్వాత రిజర్వ్‌బెంచ్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రిషభ్‌ పంత్‌ చెలరేగడంతో జట్టులో సాహా చోటుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయంపై సంభాషించిన భజ్జీ, చోప్రా ఏమన్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. పంత్‌కు తోడుగా రెండో కీపర్‌గా టీమ్‌ఇండియా సాహాను కొనసాగించాలా లేక యువ వికెట్‌కీపర్‌ వైపు మొగ్గుచూపాలా? అని చోప్రా.. హర్భజన్‌ను అడిగాడు.

‘ఇది చాలా కష్టమైన ప్రశ్న. కానీ, ఎవరినైనా ఎంపిక చేసుకోవాల్సి వస్తే కచ్చితంగా సాహానే ఎంచుకుంటాను. అతడు జట్టుతో కలిసి చాలా కాలంగా ఆడుతున్నాడు. అతడో అత్యుత్తమ కీపర్‌ కూడా. మరోవైపు పంత్‌ బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నాడు. అతడు ఆడేకొద్దీ మరింత నైపుణ్యం సాధిస్తాడు. సాహాను కొంతకాలం జట్టుతో కొనసాగించాలి. అతడి వయసు 35 ఏళ్లు దాటిందని తెలుసు. కానీ, చాలా మంది యువకుల కన్నా అతడే అత్యుత్తమం. అలాగే టీమ్‌ఇండియాకు కలిసి వచ్చే విషయం ఏమిటంటే.. కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌ లాంటి ఆటగాళ్లు కూడా కీపింగ్‌ స్థానం కోసం సిద్ధంగా ఉన్నారు’ అని చెప్పుకొచ్చాడు.

హర్భజన్‌ మాటలను అంగీకరించిన చోప్రా.. సాహాను టీమ్‌ఇండియాలోకి తీసుకుంటే జట్టు ఎంపికలో తేడా వస్తుందని అన్నాడు. ‘సాహా లాంటి ఉత్తమ కీపర్‌ ప్రపంచంలోనే ఉండడని తెలుసు కానీ, అతడిని తీసుకుంటే జట్టు కూర్పులో సమన్వయం లోపిస్తుంది. అప్పుడు ఐదుగురు బౌలర్లతో ఆడే అవకాశం ఉండదు. ఒకవేళ పంత్‌ను కొనసాగిస్తే అన్ని విధాలా సరిపోతాడు. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగవచ్చు. కానీ, సాహాను తీసుకుంటే అది కుదరదు. కెప్టెన్‌ మరోలా ఆలోచించి ఇషాన్‌ కిషన్‌ను తీసుకుంటే, అతడు బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌లోనూ రాణిస్తాడు’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటన నుంచీ అద్భుతంగా ఆడుతున్న పంత్‌ తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులోనూ మేటి ఇన్నింగ్స్‌ ఆడాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో జట్టుకు భారీ ఆధిక్యాన్ని సంపాదించి పెట్టాడు. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 135 పరుగులకు ఆలౌటై ఘోర ఓటమిని మూటగట్టుకుంది.

ఇవీ చదవండి

  • ఏప్రిల్‌ 9 నుంచి ఐపీఎల్‌

  • దేశం కోసం ఆడేటప్పుడు దేనికైనా సిద్ధపడాలి

Tags: Sports Newsక్రీడా వార్తలుCricket Newsక్రికెట్‌ వార్తలుTeam Indiaటీమ్ఇండియాWriddhiman Sahaవృద్ధిమాన్‌ సాహాRishabh Pant రిషభ్‌ పంత్‌

మరిన్ని

  • ఈ వయసులో గ్యారంటీ ఇవ్వలేను: ధోనీ [10:52]
  • చెన్నై పిచ్‌లు ఆడలేనివి కావు.. కానీ..!   [01:25]
  • పాండ్యా బ్రదర్స్‌.. ఊలాలా..[01:22]
  • మంచు.. కొంప ముంచుతోంది..[01:16]
  • డెత్‌ ఓవర్స్‌ రక్షకుడు![01:19]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • కొవిడ్‌-19 ఎందుకింత ఉద్ధృతం?ఎప్పుడు ప్రమాదకరం?
  • Curfew: తెలంగాణలో నేటి నుంచి రాత్రి వేళ!
  • మీ పేరుపై ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసుకోండి
  • తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..
  • కార్చిచ్చులా కరోనా
  • Horoscope: ఈ రోజు రాశి ఫలం
  • నా భర్తను ముద్దు పెట్టుకుంటా..ఏం చేస్తారు..
  • India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు
  • ఆ డేటా ఫోన్‌లో ఉంటే డిలీట్‌ చేయండి: ఎస్‌బీఐ
  • చెన్నై చెడుగుడు
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.