☰
బుధవారం, జనవరి 20, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • రయ్‌.. రయ్‌
  • సిరి
  • ఈ తరం
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • టెక్ కబుర్లు ‌
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 23/11/2020 12:42 IST
ఐపీఎల్‌ 13వ సీజన్‌ ఆదాయం ఎంతో తెలుసా?

స్పష్టం చేసిన కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఐపీఎల్‌ లాంటి మెగా టీ20 క్రికెట్‌ లీగ్‌ నిర్వహించి అందరి చేతా శెభాష్‌ అనిపించుకుంది బీసీసీఐ. ఏటా వేసవి కాలంలో భారత్‌లో నిర్వహించే ఈ లీగ్‌.. కరోనా పరిస్థితుల ప్రభావంతో ఈసారి యూఏఈకి తరలివెళ్లింది. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు 50 రోజులకి పైగా క్రికెట్‌ ప్రేమికుల్ని అలరించింది. అయితే, ఎప్పుడూ అభిమానుల కేరింతలతో ఉత్సాహభరితంగా కనిపించే మైదానాలు ఈసారి ఎవరూ లేక వెలవెలబోయాయి. అయినా ఆ లోటు కనిపించకుండా నిర్వాహకులు వర్చువల్‌ పద్ధతిలో ఉత్సాహపరిచారు. ఇలాంటి‌ పరిస్థితుల్లో ఇంత పెద్ద టోర్నీ నిర్వహించడం సాధ్యమేనా అనుకునే తరుణంలో బీసీసీఐ దిగ్విజయంగా పూర్తి చేయడమే కాకుండా మంచి ఆదాయాన్ని ఆర్జించిందని కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ పేర్కొన్నారు.

తాజాగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన ఆయన.. టోర్నీ నిర్వహణ, దాని ఆదాయంపై స్పందించాడు. ఈ 13వ సీజన్‌ నిర్వహించడంపై తొలుత అందరూ అనుమానాలు వ్యక్తం చేశారని, కానీ ప్రధాన కార్యదర్శి జైషా ధైర్యం చేసి ముందడుగు వేశారని చెప్పారు. ఇక చెన్నై జట్టులో కరోనా కేసులు తేలడంతో అప్పుడు కాస్త ఆలోచించామన్నారు. వారికి లక్షణాలు లేకపోవడంతో ఐసోలేషన్‌లో ఉంచామని, తర్వాత ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించామని చెప్పారు. ప్రత్యేక వైద్య బృందాలతో పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్లంతా కోలుకున్నాక టోర్నీని దిగ్విజయంగా కొనసాగించినట్లు వివరించారు. అయితే, ఈ సీజన్‌ నిర్వహణ మొత్తంలో 35 శాతం ఖర్చులు తగ్గించుకున్నట్లు తెలిపారు. బీసీసీఐ సుమారు 4 వేల కోట్ల ఆదాయం పొందిందని, అలాగే గతేడాదితో పోలిస్తే ఈసారి టీవీ, డిజిటల్‌ మాధ్యమాల వీక్షకుల సంఖ్య 25 శాతం పెరిగిందని వివరించారు. టోర్నీ జరిగినన్ని రోజులు అన్ని ఫ్రాంఛైజీల వారికి మొత్తం 30 వేల ఆర్టీ-పీసీఆర్‌ కొవిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు అరుణ్‌ వెల్లడించారు.

Tags: Arun DhumalBCCIT20 CricketSourav GangulyJaishahఅరుణ్‌ ధుమాల్‌బీసీసీఐటీ20 క్రికెట్‌సౌరభ్‌ గంగూలీజైషా

మరిన్ని

  • రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను![01:51]
  • రహానె వ్యూహం.. కుర్రాళ్ల పోరాటం... అద్భుతం[23:19]
  • వీరే ‘గబ్బా’ర్‌ సింగ్‌లు..![20:46]
  • ఇంగ్లాండ్‌ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక[20:17]
  • ఆసీస్‌ మాజీలూ.. ఇప్పుడేమంటారు?[20:02]
  • మాటల్లో చెప్పలేను: రహానె[18:23]
  • గబ్బా కోటకు టీమ్‌ఇండియా బీటలు[17:29]
  • టీమిండియాకు బోనస్‌ ప్రకటించిన బీసీసీఐ  [16:36]
  • ఆసీస్‌ పొగరుకు, గర్వానికి ఓటమిది[16:10]
  • విజయానికి చేరువలో భారత్‌[12:38]
  • ఐదో వికెట్‌ కోల్పోయిన టీమ్‌ఇండియా[12:25]
  • గబ్బా టెస్టు: రిషభ్‌ పంత్‌ అర్ధశతకం..[12:05]
  • విజయానికి 80 పరుగుల దూరంలో భారత్‌[11:49]
  • గబ్బా టెస్టు: పుజారా  హాఫ్‌ సెంచరీ[11:17]
  • గబ్బా టెస్టు: టీ విరామానికి భారత్‌ 183/3[10:23]
  • మూడో వికెట్‌ కోల్పోయిన టీమ్‌ఇండియా[09:56]
  • గబ్బా టెస్టు: రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌[09:11]
  • గబ్బా టెస్టు: 100 దాటిన టీమ్‌ఇండియా[08:33]
  • గబ్బా టెస్టు: భోజన విరామానికి భారత్‌ 83/1[07:39]
  • గబ్బా టెస్టు: శుభ్‌మన్‌ గిల్‌ అర్ధశతకం[06:56]
  • తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌[05:39]
  • ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం[01:34]
  • ఇంటర్వ్యూయర్‌గా మారిన యాష్‌[01:26]
  • సిరాజ్‌.. ఇక కుర్రాడు కాదు[01:22]
  • భారత్‌ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులు[01:48]
  • ధోనీని అధిగమించి పంత్ కొత్త‌ రికార్డు..  [14:29]
  • భారత్‌ విజయం అమితానందాన్నిచ్చింది: మోదీ[14:16]
  • భారత్‌ చిరస్మరణీయ విజయం..[13:07]
  • అదే మన ఆఖరి ఫొటో అవుతుందని తెలియదు..  [10:46]
  • స్మిత్‌ చూస్తుండగానే రోహిత్‌ షాడో బ్యాటింగ్‌[01:40]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆసీస్‌ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
  • రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!
  • అమిత్‌ షాతో కీలక అంశాలు చర్చించిన జగన్‌
  • వీరే ‘గబ్బా’ర్‌ సింగ్‌లు..!
  • మెగాస్టార్‌ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
  • ‘కేరింత’ హీరోపై కేసు నమోదు
  • రహానె వ్యూహం.. కుర్రాళ్ల పోరాటం... అద్భుతం
  • కరోనా భయంతో.. అలా చేశాడట..!
  • మాటల్లో చెప్పలేను: రహానె
  • ఆసీస్‌ పొగరుకు, గర్వానికి ఓటమిది
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.