☰
గురువారం, ఏప్రిల్ 15, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 01/03/2021 09:41 IST
వారి స్పిన్‌కు మావద్ద సమాధానం కరవు..!

నాలుగో టెస్టు పిచ్‌ ఎలా ఉండనుందో అర్థమైంది: బెన్‌ఫోక్స్‌

(Photo: England Cricket Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాతో తలపడిన మూడో టెస్టులో తమ జట్టు పూర్తిగా విఫలమైందని, కోహ్లీసేన బాగా ఆడిందని ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ బెన్‌ఫోక్స్‌ అభిప్రాయపడ్డాడు. నాలుగో టెస్టుకు ముందు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. చివరి టెస్టులో తమ జట్టు మరింత బాగా బ్యాటింగ్‌ చేయడానికి సరైన మార్గం కనుగొనాలని తెలిపాడు. గతవారం జరిగిన పింక్‌బాల్‌ టెస్టుపై స్పందించిన ఫోక్స్‌.. అది కఠినమైన పిచ్‌ అని పేర్కొన్నాడు.

‘కచ్చితంగా మేం పూర్తిగా విఫలమయ్యాం. చెన్నై, మొతేరా పిచ్‌లు కష్టతరమైనవి. కానీ, టీమ్‌ఇండియా మాకన్నా బాగా ఆడింది. ఆ జట్టులో పలువురు నాణ్యమైన స్పిన్నర్లున్నారు. దాంతో వారి బౌలింగ్‌కు మా వద్ద సమాధానం కరవైంది. ఇక రాబోయే మ్యాచ్‌లో మరింత జాగ్రత్తగా ఆడి వారిని ఎదుర్కొని భారీ స్కోర్‌ సాధించాలి. అయితే, ఆ మ్యాచ్‌లో ఎలాంటి పిచ్‌ ఉండబోతుందనే విషయంపై మాకో స్పష్టమైన అవగాహన ఉంది. తొలి బంతి నుంచే విపరీతమైన టర్నింగ్‌ ఉంటుందని మేం అనకుంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో బాగా ఆడడానికి సరైన మార్గం అన్వేషించాలి’ అని ఇంగ్లాండ్‌ కీపర్‌ చెప్పుకొచ్చాడు.

అలాగే గత రెండు టెస్టుల్లోనూ పిచ్‌ కఠినంగా ఉందని, ఇలాంటి వాటిని ముందెప్పుడూ చూడలేదని ఫోక్స్‌ అన్నాడు. ముఖ్యంగా పింక్‌బాల్‌ టెస్టులో బంతి మరీ ఎక్కువగా తిరిగిందన్నాడు. ఇలాంటి పిచ్‌లపై కీపింగ్‌ చేయడం కష్టంగా మారిందన్నాడు. ఇక వరుసగా రెండు టెస్టులు ఓటమిపాలైనా ఇప్పటికీ తమకు సిరీస్‌ డ్రా చేసుకునే అవకాశం ఉందన్నాడు. చివరి మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేసి 2-2తేడాతో తిరిగి స్వదేశానికి వెళితే అది బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇవీ చదవండి

  • సవాళ్లకు పంచ్‌

  • మైదానంలో మాణిక్యాలు

Tags: Sports Newsక్రీడా వార్తలుCricket Newsక్రికెట్‌ వార్తలుBen Foakesబెన్‌ఫోక్స్‌IndvsEngభారత్‌Xఇంగ్లాండ్‌

మరిన్ని

  • ఉత్కంఠ పోరులో బెంగళూరుదే విజయం[23:32]
  • మరో దిల్లీ ఆటగాడికి కరోనా[23:00]
  • హైదరాబాద్‌ లక్ష్యం 150[21:18]
  • మాజీ కెప్టెన్‌పై ఐసీసీ ఎనిమిదేళ్ల నిషేధం[19:27]
  • రోహిత్‌ అభిమానులకు ‘స్విగ్గీ’ క్షమాపణ![16:22]
  • కేకేఆర్‌ ఓటమి సిగ్గుచేటు: వీరూ ఫైర్‌[14:36]
  • షారుఖ్‌ క్షమాపణ: ఇదే ముగింపు కాదన్న రసెల్‌[13:18]
  • కోల్‌కతా ఓటమి: షారుఖ్‌ క్షమాపణలు[12:00]
  • ముంబయికి ఇది కొత్తేం కాదు![10:36]
  • రోహిత్‌ నమ్మాడు.. రాహులే వికెట్లు తీశాడు[08:11]
  • రైనా నమ్మకం.. సంజూ లోగో.. భువి అవార్డు![01:12]
  • బుమ్రా కన్నా షాహిన్‌.. కోహ్లీ కన్నా బాబర్‌ మిన్న![01:06]
  • పంత్‌, అశ్విన్ తర్వాత భువి[01:02]
  • ఈసారి 10 గజాలు ఎక్కువ దూరమే కొడతాడు![01:15]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • వకీల్‌సాబ్‌.. పవన్‌ని హత్తుకున్న తారక్‌!
  • ఉత్కంఠ పోరులో బెంగళూరుదే విజయం
  • సామ్‌ జీవిత పాఠాలు.. తల పట్టుకున్న చాందిని
  • రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
  • తొషిబా సీఈవో రాజీనామా
  • మహారాష్ట్రను కలవరపెడుతోన్న ‘డబుల్‌ మ్యుటేషన్‌’!
  • వాల్ట్‌ డిస్నీ భారతీయ విభాగం చీఫ్‌గా మాధవన్‌
  • సచిన్ వాజే కేసులో కొత్త ట్విస్ట్‌..!
  • మోడెర్నా టీకా: 6 నెలలైనా అదే సామర్థ్యం!
  • వైకాపా ఎమ్మెల్యేకు కరోనా..ఐసీయూలో చికిత్స
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.