దిల్లీ: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ విజయం నేపథ్యంలో టీమిండియాపై బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ సారథి సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించారు. భారత క్రికెట్ చరిత్రలో ఈ విజయం చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. గబ్బాలో అదరగొట్టిన టీమిండియాకు అభినందనలు తెలిపారు. ఈ విజయోత్సాహంలో బీసీసీఐ తరఫున రూ.5కోట్ల బోనస్ ప్రకటించారు. ఈ అద్భుత విజయంలో భాగస్వాములైన క్రీడాకారులు, సహకరించిన సిబ్బందికి ఈ మొత్తాన్ని ప్రకటించారు. ఈ గెలుపు విలువ అంకెలకు మించినదంటూ ట్వీట్ చేశారు. గెలుపులో భాగస్వాములైన ప్రతిఒక్కరినీ అభినందించారు. మరోవైపు, గబ్బా వేదికగా టీమిండియా చూపిన అసాధారణ ఆటతీరుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవీ చదవండి..